భారీ వర్షాలు (Heavy Rains) వేలాది కుటుంబాల్లో ఎంతో బాధను , విషాదాన్ని నింపింది. వరదలకు ఎన్నో ఇల్లు నేలమట్టం కాగా, వందలాది పంటపొలాలు కొట్టుకుపోయాయి. అంతే కాదు వరదల్లో పలు వాహనాలు కొట్టుకుపోయి..పలువురు మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం ఐదుగురు మృతి చెందారంటే అర్ధం చేసుకోవాలి భారీ వర్షాలు ఎంతటి విషాదాన్ని నింపాయో.. మహబూబాబాద్ జిల్లాలో కారు కొట్టుకుపోయి డా. అశ్విని, వెంకటాపురంలో చేపల వేటకు వెళ్లిన నర్సయ్య, వరంగల్ జిల్లా గిర్నిబావి వాగులో చిక్కుకొని వజ్రమ్మ, ములుగు జిల్లా కాల్వపల్లి వాగులో పడి మల్లికార్జున్, హన్మకొండ జిల్లా పరకాలలో విద్యుత్ షాక్తో యాదగిరి మృతి చెందారు.
We’re now on WhatsApp. Click to Join.
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎక్కమేడు గ్రామానికి చెందిన హనుమమ్మ(75), కూతురు అంజిలమ్మ(38) ఇంట్లో పడుకున్నారు. వర్షానికి తడిసిన ఇల్లు కూలడంతో ఇద్దరు మృతి చెందారు. భర్త చనిపోవడం అంజిలమ్మ తల్లి దగ్గరే ఉంటుందని స్థానికులు చెప్పారు. అయితే ఘటనాస్థలంలో మృతుల బంధువుల రోదనలు కన్నీరు పెట్టిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ఘటన లో సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు మృతి చెందారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో మందపల్లికి చెందిన వృద్ధురాలు మరణించింది. మలుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పశువులను మోతకు తీసుకెళ్లి వస్తుండగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందాడు. పరకాల గ్రామానికి చెందిన మరో వ్యక్తి చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతు అయ్యి చివరికి శవంగా బయటకువచ్చాడు. ఇలా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదుగురు మృతి చెందడం ఆయా కుటుంబాల్లో విషాదం నింపింది.
Read Also : Pawan Kalyan OG : ఓజీ వస్తున్నాడు మరి విజయ్ పరిస్తితి ఏంటి..?