Site icon HashtagU Telugu

Basara : బాసరలో విషాదం..స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి

Five Youth From Hyderabad D

Five Youth From Hyderabad D

నిర్మల్ జిల్లా బాసర (Basara ) గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు నీట మునిగి మృతి చెందడం తీవ్ర విషాదంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన యువకులు (Rakesh, Vinod, Madan, Rutik, and Bharat, all residents of Hyderabad) సరస్వతి అమ్మవారి దర్శనార్థం బాసరకు వచ్చి, ఆదివారం ఉదయం గోదావరి(Godavari River )లో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే నీటి ఉదృతి ఎక్కువగా ఉండడం తో వారు నీటిలో గల్లంతై మృతి చెందారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు, నదుల్లో వద్ద ఇటీవల జరిగిన ప్రమాదాలను గుర్తుచేస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లలపై జాగ్రత్త వహించాలని సూచించారు. ముఖ్యంగా లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు మరల జరగకుండా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇక కంచ ఐలయ్య సోదరుడు కంచ కట్టయ్య ఆకస్మిక మృతిపై కూడా మంత్రి పొన్నం స్పందించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. పరమాత్మ ఆయన ఆత్మకు శాంతి కలగజేయాలని ప్రార్థిస్తూ, మేమంతా మీ కుటుంబానికి తోడుగా ఉన్నామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండు ఘటనలు తీవ్ర బాధను కలిగిస్తున్నాయని మంత్రి అన్నారు.