Fish Prasadam : మృగశిర కార్తె వేళ జూన్ 8న బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం మత్స్యశాఖ నుంచి 1.5 లక్షల చేప పిల్లలను సిద్ధం చేస్తున్నారు. ఆస్తమా లాంటి శ్వాసకోశ వ్యాధులున్న వారికి బత్తిని కుటుంబ సభ్యులు ఉచితంగా చేప మందును పంపిణీ చేయనున్నారు. ఈ మందు కోసం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలిరానున్నారు. ఇంతకీ మృగశిర కార్తె రోజే చేప ప్రసాదం ఎందుకిస్తారు ? ఆ రోజే ఎందుకు తీసుకోవాలి ? అనే దాని గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Kalvakuntla Kavitha : నిజామాబాద్‌లో కవిత ఎలా ఓడిపోయారు ? ఎవరు ఓడించారు ?
మృగశిర కార్తె.. నక్షత్రాల లెక్కలు
జోతిష్య పండితులు.. 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు, పంచాంగాలను తయారు చేస్తుంటారు. సూర్యోదయం టైంలో ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరును పెడతారు. తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగాలను తయారు చేసుకుంటారు. వీటిని కార్తెలు అని పిలుస్తారు. వారి ప్రకారం సంవత్సరానికి మొత్తం 27 కార్తెలు ఉంటాయి. తెలుగు ప్రజలు చాంద్రమానాన్ని పాటిస్తాయి. సూర్యుడు మృగశిర నక్షత్రానికి దగ్గరగా ఉండే రోజులను మృగశిర కార్తె అని పిలుస్తారు.
Also Read :Operation Sindoor : భారతీయుల ఐక్యతా శక్తిని ఎవరూ ఢీకొనలేరు : ప్రధాని మోడీ
మృగశిర కార్తె రోజే.. ఎందుకంటే ?
‘‘మృగశిర కార్తెలో ముంగిళ్లు చల్లబడుతాయి. మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేస్తది. మృగశిరకు ముల్లోకాలు చల్లబడతాయి’’ అంటూ తెలంగాణ రైతులు సామెతలను చెప్పుకుంటారు. మృగశిర కార్తె ప్రవేశించగానే ఎండల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ టైంలో శరీరంలో వేడిని పెంచడానికి మృగశిర కార్తె రోజు నుంచి చేపలు ఎక్కువగా తింటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. మృగశిర కార్తె ప్రారంభమైన రోజే చేప ప్రసాదం(Fish Prasadam) పంపిణీ చేస్తే బాధితులకు సరిగ్గా పని చేస్తుందని నమ్ముతారు. జ్వరం, దగ్గు, ఇతరత్రా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు మాంసాహారులు చేపలను తింటారు. శాఖాహారులైతే బెల్లంలో ఇంగువను కలుపుకొని చిన్న ముద్దలుగా చేసుకుని తింటారు.