Fish Medicine: చేపమందు పంపిణీకి రంగం సిద్ధం!

దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ చేప ముందు పంపిణీ కాబోతుంది.

  • Written By:
  • Updated On - April 26, 2023 / 11:35 AM IST

ఉబ్బసం వ్యాధి గ్రస్తులకు గుడ్ న్యూస్. త్వరలోనే చేపమందు అందుబాటులోకి రాబుతోంది. చేపమందు (Fish Medicine) పంపిణీ కరోనా కారణంగా  ఆగిపోయింది. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ చేప ముందు పంపిణీ కాబోతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు సమాచారం. ఎప్పటిలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు పంపిణీ చేయడానికి బత్తిని సోదరులకు అనుమతి లభించింది. దీంతో చేపమందు పంపిణీపై బత్తిని సోదరులు ఓ ప్రకటన విడుదల చేశారు.

జూన్ 10 తేదీ ఉదయం 8 గంటల నుంచి జూన్ 11 వ తేదీ ఉదయం 8 గంటల వరకు 24 గంటల సేపు హైదరాబాద్ (Hyderabad) లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు పంపిణీ చేస్తామని బత్తిని కుటుంబం ప్రకటించింది. ప్రతి ఏడాదీ ఉచితంగా బత్తిని సోదరులు చేపమందు పంపిణీ చేస్తుంటారు. శాస్త్రీయ ఆధారాలు ఎలా ఉన్నా.. చేపమందుకోసం ఇతర రాష్ట్రాలనుంచి కూడా ఉబ్బసం వ్యాధిగ్రస్తులు హైదరాబాద్ కి వస్తుంటారు. కరోనా వల్ల మూడేళ్లుగా పంపిణీ వాయిదా పడింది. ఈఏడాది ఎట్టకేలకు అనుమతి లభించింది.

ప్రతి ఏడాదీ మృగశిర కార్తె సందర్భంగా చేపమందు పంపిణీ చేస్తారు. ఆయుర్వేద మందుతోపాటు పాలపిండి, ఇంగువ, బెల్లం, పసుపు వంటి సహజ పదార్ధాలను దీని తయారీలో వాడతారు. ఈ మందుని కొరమీను చేపనోటిలో ఉంచి రోగులతో మింగిస్తారు. ఆ సమయంలో చేపపిల్ల బతికి ఉంటే మందు బాగా పనిచేస్తుందని నమ్మకం.

Also Read: Delhi Public School : ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు.. పాఠశాలను ఖాళీ చేయించిన అధికారులు