Site icon HashtagU Telugu

Congress Vs BRS : కాంగ్రెస్‌తో టచ్‌లోకి ఐదుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ?

Congress Vs Brs

Congress Vs Brs

Congress Vs BRS : ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ కావడం కామన్. మళ్లీ ఇప్పుడు కూడా ఆ ట్రెండ్ మొదలైంది. రాష్ట్రంలో మెజారిటీ సీట్లను సాధించిన కాంగ్రెస్ వైపు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూస్తున్నారని తెలుస్తోంది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన కొన్ని గంటల్లోనే బీఆర్ఎస్ నుంచి గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వెళ్లి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన రేవంత్ రెడ్డిని కలిసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఫొటోలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు. ఎస్టీ రిజర్వుడ్ స్థానమైన భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన తెల్లం కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై 5719 ఓట్ల తేడాతో గెలిచారు.

We’re now on WhatsApp. Click to Join.

మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వచ్చినట్టు తెలుస్తోంది. వాళ్లు మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డి, వివేకానంద, అరికపూడి గాంధీగా లీకులు వస్తున్నాయి. ఇక బీజేపీలో గెలిచిన పలువురు నేతలు కూడా కాంగ్రెస్‌వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఏర్పాటయ్యే సరికి ఈ  జంపింగుల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలుండగా కాంగ్రెస్‌కు 64 సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ ఒక్క స్థానంలో(Congress Vs BRS)  గెలిచాయి.

Also Read: Baba Balak Nath : రాజస్థాన్ సీఎం రేసులో మరో ‘యోగి’.. బాబా బాలక్‌నాథ్‌ ఎవరు ?