Hyderabad: హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సు

పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదంపై హైదరాబాద్ నగరంలో మొదటిసారి అంతర్జాతీయ సదస్సు జరగనుంది.

  • Written By:
  • Updated On - November 24, 2022 / 06:13 PM IST

పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదంపై హైదరాబాద్ నగరంలో మొదటిసారి అంతర్జాతీయ సదస్సు జరగనుంది. వచ్చే ఏడాది జనవరి 21-22న ఐఐటీ క్యాంపస్‌లో ఈ సదస్సును ఎస్‌జీపీ నిర్వహించనుంది. ఈ సదస్సులో విస్తృత స్ధాయి శాస్త్రీయ పరిశోధనలు, స్టాటిస్టికల్‌ డాటా పాయింట్లు, ఆయుర్వేద మౌలిక సూత్రాలు వంటివి చర్చించనున్నారు. 8 దేశాల నుంచి దాదాపు 400 మంది పరిశోధకులు, డాక్టర్లు, ఆయర్వేద ప్రాక్టీషనర్లు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

అమెరికా, యూకే, రష్యా, కెనడా, భారత్‌తో పాటు మరో 8 దేశాలకు చెందిన పరిశోధకులు, వైద్యులు, ఆయుర్వేద నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు, కార్పొరేట్ ప్రతినిధులు సహా 12 దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి తెలిపారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఇంటిగ్రేటివ్, రీజెనరేటివ్, హోలిస్టిక్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ అయిన SGP (సాయి గంగా పనాకియా) వ్యవస్థాపకులు గురువారం ఓ సమావేశంలో తెలిపారు.

ఆయుర్వేదం, హల్లోపతి సమాజంలోని వైద్య నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేట్, పౌర సమాజ సంస్థలు ఈ కార్యక్రమంలో శతాబ్దాల నాటి ఆయుర్వేద సూత్రాల గ్రంధం ఆధారంగా తాజా శాస్త్ర పరిశోధన ఫలితాలను చర్చించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పరీక్ష కేసులు, గణాంక డేటా పాయింట్లు, పరిశోధన నివేదికలు కూడా సదస్సులో సమర్పించబడతాయని డాక్టర్ రవిశంకర్ తెలిపారు. ఈ సమావేశానికి భారత ప్రభుత్వం ఆయుష్ శాఖ, UK ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ ఆన్ ఇండియన్ సైన్సెస్, రష్యన్ అకాడమీ ఆఫ్ నేచురల్ సైన్సెస్ వంటి అంతర్జాతీయ సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. ఈ సదస్సును ప్రారంభించేందుకు.. మద్దతు ఇచ్చేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కూడా సమ్మతించారు.