హైదరాబాద్ ట్రాఫిక్ (Hyderabad Traffic) గురించి ఎంత చెప్పిన తక్కువే..ఎన్ని మెట్రో ట్రైన్లు , MMTS ఉన్న కానీ ట్రాఫిక్ పెరగడమే కానీ తగ్గడం లేదు. దీంతో ప్రభుత్వం ట్రాఫిక్ ను తగ్గించేందుకు అనేక విధాలుగా కృషి చేస్తూనే ఉంది. ఇక జాతీయ రహదారి – 44పై దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వాహనదారుల కష్టాలకు చరమగీతం పాడేందుకు 5.3 కిలోమీటర్ల మేర కారిడార్ (Double Decker Corridor) నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్‌పైనే మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఈ రకంగా నగరంలో తొలి డబుల్ డెక్కర్ కారిడార్‌కు ప్రస్థానం ప్రారంభంకానుంది. అటు బైరామల్‌గూడ కూడలిలో నిర్మించిన రెండోస్థాయి పైవంతెనను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై భవిష్యత్తులో రెండో దశలో మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తారు. ఇది ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్‌పల్లి, డెయిరీ ఫామ్ రోడ్ NH 44 వరకూ ఉంటుంది. ఇది మొత్తం 6 లేన్ల రహదారి. దీని వల్ల సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు తీరతాయి. అలాగే.. హైదరాబాద్ నుంచి మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు మెరుగైన రవాణా సదుపాయం లభిస్తుంది. పై నుంచి సాగే ఈ రహదారికి ఈమధ్య కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. అందువల్ల ఇప్పుడు ఈ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇది ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై.. తాడ్‌బండ్ జంక్షన్, బోయిన్‌పల్లి జంక్షన్ మీదుగా వెళ్తూ.. డెయిరీ ఫామ్ రోడ్డు దగ్గర ముగుస్తుంది. ఇందులో పై నుంచి వెళ్లే కారిడార్ 4.650 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే అండర్‌గ్రౌండ్ టన్నెల్ 0.6 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి మొత్తం 73.16 ఎకరాల భూమి అవసరం కాగా, ఇందులో రక్షణ శాఖ ఇస్తున్నవి 55.85 ఎకరాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ల్యాండ్ 8.41 కిలోమీటర్లు ఉంది. ఇంకా అండర్‌గ్రౌండ్ సొరంగానికి రూ.8.9 ఎకరాలు కేటాయించారు. ఇది పూర్తవ్వడానికి ఒక సంవత్సరం పట్టే అవకాశాలు ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
మల్కాజిగిరి ఎంపీగా ఎన్నికైన నాటి నుంచే రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ వచ్చారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించగా ఆ వెంటనే కంటోన్మెంట్ భూముల అప్పగింతపై కేంద్రానికి విన్నవించారు. జనవరి 5న దిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defense Minister Rajnath Singh)ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. కేంద్ర మంత్రితో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, కంటోన్మెంట్ ప్రాంతంలో రహదారుల విస్తరణకు రక్షణ శాఖ భూములు అప్పగించాలని, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. వెంటనే స్పందించిన రక్షణశాఖ ఈ మేరకు అంగీకారం తెలియజేస్తూ, మార్చి ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
Read Also : Group 1 Prelims : రేపటి నుంచే గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు.. 17న ఎగ్జామ్
