తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా గత నాల్గు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు వాగులు , వంకలు , చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయి. అనేక జలాశయాలు నిండుకుండలమారిపోయాయి. ఇక భద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి (Godavari) ఉదృతంగా ప్రవహిస్తుంది. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గోదావరి నీటిమట్టం 38.5 అడుగులుకు చేరగా సాయంత్రంకు 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు నీటి మట్టం చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ప్రస్తుతం వర్షాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో పాటు గోదావరి పరీవాహక ప్రాంతంలో కొనసాగితే వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
గోదావరిలో వరద నీరు పెరగడంతో భద్రాచలం స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు వరదనీటిలో మునిగిపోయాయి. చర్ల మండలం వద్ద ఈత వాగు పైనుంచి వరదనీరు పారడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం వద్ద సీత వాగు గుబ్బల మంగి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం వరదనీటిలో మునిగిపోయింది. భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు వెళ్లే ప్రధాన రహదారి చట్టి వద్ద వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి దిగువన ఉన్న శబరి నదికి వరద నీరు భారీగా పోటెత్తడంతో భద్రాచలం నుంచి వరద నీరు దిగువకు నెమ్మదిగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 8,38,117 క్యూసెక్కుల వరద ప్రవహం కొనసాగుతోంది. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులుఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటి వరకు 1986 లో 75.60 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. ఇదే ఇప్పటి వరకు రికార్డు. 2022లో 71.30 అడుగులకు నీటిమట్టం పెరిగింది. 1990లో 70.3 అడుగులకు, 2006లో 66.9 అడుగులకు, 1976లో 63.9 అడుగులకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం చేరింది.
Read Also : Chiranjeevi : సందీప్ వంగతో చిరంజీవి మూవీ కన్ఫార్మ్ అయ్యిందా..!