Mulugu : ములుగు అడవి కాలిపోతున్న పట్టించుకోని అటవీ అధికారులు

రోజురోజూకు ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఎండలతో అడవుల్లో చెట్ల ఆకులు రాలుతున్నాయి. ఈ నేపపథ్యంలో అడవుల్లో నిప్పురాజుకుని తరచూ మంటలు చెలరేగుతున్నాయి

Published By: HashtagU Telugu Desk
Mulugu Forest

Mulugu Forest

రెండు రోజులుగా ములుగు(Mulugu) జిల్లాలోని పస్రా,(Pasra) తాడ్వాయి అటవీ ప్రాంతంలో(Forest area) కార్చిచ్చు(Fire accident) రగులుతున్న అటవీ అధికారులు పట్టించుకోకపోవడం ఫై స్థానికులు , వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజూకు ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఎండలతో అడవుల్లో చెట్ల ఆకులు రాలుతున్నాయి. ఈ నేపపథ్యంలో అడవుల్లో నిప్పురాజుకుని తరచూ మంటలు చెలరేగుతున్నాయి. కొంతమంది ఆకతాయిలు చేసే పని వల్ల వేలాది ఎకరాలున్న అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతవుతుంటాయి. తాజాగా ములుగు అటవీ ప్రాంతంలో కూడా ఇదే జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

శనివారం సాయంత్రం నుండి పస్రా,(Pasra) తాడ్వాయి అటవీ ప్రాంతంలో(Forest area) కార్చిచ్చు రగిలింది. అగ్నికి వందలాది ఎకరాల్లో దగ్ధమవుతున్నది. ప్రాణ భయంతో వన్య ప్రాణులు గ్రామాల్లోకి పరుగులు తీస్తున్నాయి. రెండు రోజులుగా అగ్నికి అటవీ కాలిపోతున్న అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజనులు , వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీగా పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అగ్ని ప్రమాదం వల్ల భారీ వృక్షాలు కాలిపోతున్నాయి. ఇప్పటికైనా అటవీ అధికారులు త్వరగా మంటలను ఆర్పలేని కోరుతున్నారు.

మరోపక్క నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ పులల అభయారణ్యం ప్రాంతంలో శనివారం రాత్రి మరోసారి కార్చిచ్చు రగిలి వంద హెక్టార్ల విస్తీర్ణంలో అడవి అగ్నికి ఆహుతైపోయింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో మన్ననూరు వెస్ట్‌బీట్‌లోని తాళ్ల చెలక, గుండం అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు శాటిలైట్‌ యాప్‌ (ఎంవోడీఐఎస్‌, ఎస్‌ఎ్‌సపీటీ) ద్వారా సమాచారం అందుకున్న డీఎ్‌ఫవో రోహిత్‌ గోపిడి, అమ్రాబాద్‌, మన్ననూరు రేంజ్‌ అధికారులు ఆదిత్య, ఈశ్వర్‌, బీట్‌ అధికారులు హన్మంతు, మధు, కార్తీక్‌, క్విక్‌ రెస్పాన్స్‌ బృందం, బేస్‌ క్యాంపు వాచర్లు రెండు బృందాలుగా ఏర్పడి రాత్రంతా బ్లోయర్ల సాయంతో శ్రమించి మంటలను ఆర్పివేశారు.

Read Also : Delhi Liquor Policy Case : ఎమ్మెల్సీ కవిత కు నో బెయిల్..

  Last Updated: 08 Apr 2024, 10:37 AM IST