హైదరాబాద్ (Hyderabad) నగరంలో సోమవారం ఉదయం అనుకోకుండా జరిగిన అగ్నిప్రమాదం (Fire Accident) కలకలం రేపింది. పార్క్ హయత్ హోటల్(Park Hyatt Hotel)లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో హోటల్‌లో ఉన్నవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో హోటల్ అంతా పొగతో నిండిపోయింది. టూరిస్టులు, హోటల్ సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే హోటల్‌కు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Amazon : అమెజాన్ ఇండియాతో ఇండియా SME ఫోరం ఒప్పందం
ఈ ప్రమాదానికి విద్యుత్ వైర్లలో షార్ట్ సర్క్యూట్ కారణమని ఫైర్ అధికారుల ప్రాథమిక అంచనా. ప్రమాదం ఫస్ట్ ఫ్లోర్‌లో జరిగినప్పటికీ హోటల్ మొత్తం పొగతో నిండిపోయింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. అధికారులు ప్రస్తుతం మిగిలిన వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో హోటల్ నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా ప్రమాదం జరిగిన హోటల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ టీమ్ (SRH Team) బస చేయడం క్రికెట్ అభిమానుల్లో షాక్ కు గురి చేసింది. ప్రమాద సమయంలో ఆటగాళ్లు 6వ అంతస్తులో ఉన్నారని సమాచారం. హోటల్ సిబ్బంది తక్షణమే వారిని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. ఆటగాళ్లు పూర్తిగా సేఫ్‌గా ఉన్నారని తెలుస్తోంది. శనివారం పంజాబ్‌పై విజయాన్ని సాధించిన అనంతరం ఆనందంగా ఉన్న సన్‌రైజర్స్ ప్లేయర్లకు ఈ సంఘటన షాక్ ఇచ్చింది. అయినా సరే, ప్రమాదం నుంచి బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.