హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున దిల్‌సుఖ్‌నగర్ ఆర్టీసీ డిపో (Dilsukhnagar Bus Depot)లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు బస్సులు (2 Bus) పూర్తిగా దగ్ధం కాగా..మరో బస్సు కు అగ్ని అంటుకుంది. అగ్ని ప్రమాద ఘటన విషయాన్నీ అగ్ని మాపక సిబ్బందికి ఆర్టీసీ సిబ్బంది తెలియజేయడం తో వారు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లేదంటే మరింత ఆస్తి నష్టం వాటిల్లేది. సోమవారం తెల్లవారుజామున డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్‌ప్రెస్ బస్సులో ఒక్కసారిగా నిప్పు అంటుకున్నది. క్రమంగా వ్యాపించిన మంటలు పక్కనే ఉన్న మరో బస్సుకు అంటుకున్నాయి. దీంతో చూస్తుండగానే రెండు బస్సులు కాలిబూడిదయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join.
అయితే ప్రమాదానికి గల కారాణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం సమయంలో డిపోలో చాలా బస్సులు పార్కింగ్ చేసి ఉండటం, మంటలు రెండు బస్సులకు పరిమితం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, బస్సులో షాక్ సర్క్యూట్ అవడం వల్లే మంటలు చెలరేగాయిన డిపో అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల నగరంలో అగ్ని ప్రమాదాలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ప్రతి రోజు ఎక్కడో చోట అగ్ని ప్రమాద వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. ఈ ప్రమాదాల వల్ల ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం జరుగుతుంది. అగ్ని ప్రమాదాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ పలు కంపెనీ లు , సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ప్రతి నిత్యం ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
Read Also : Ram Mandir: అయోధ్యలో పెంచిన వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ సామర్ధ్యం