నల్గొండ జిల్లా దామరచర్లలో నిర్మాణంలో ఉన్న ప్రతిష్టాత్మక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్(Yadadri Thermal Power Plant)లో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. మొదటి యూనిట్‌లో బాయిలర్ ఆయిల్ లీక్ కావడం, అదే సమయంలో దిగువలో వెల్డింగ్ పనులు జరగడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ అగ్ని కీలలు యూనిట్ మొత్తాన్ని చుట్టేసాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనతో మొదటి యూనిట్‌లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయింది.
Veeraiah Chowdary Murder Case : ఒక్కో పోటుకు రూ.2 లక్షలు!
ఇదే యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అప్పట్లో యాష్ ప్లాంట్ వద్ద బూడిద పడటంతో ఆరుగురు కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. రెండో యూనిట్ 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న సమయంలో బాయిలర్ ట్రిప్ కావడం, యాష్ జామ్ వంటి సమస్యలు ఏర్పడిన సంగతి తెలిసిందే. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కార్మికుల ప్రాణ భద్రతను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ఉత్పత్తిలో కీలకమైన ప్రాజెక్టు కావడంతో, ఇటువంటి ప్రమాదాలు రాష్ట్ర విద్యుత్ భవిష్యత్తుపై ముసుగులు మోపుతున్నాయి. కార్మిక సంఘాలు ఈ ప్రమాదాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపి కారణాలను వెలికితీయాలని, భవిష్యత్తులో మరింత పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం మరియు అధికారులు ప్లాంట్ నిర్మాణం, కార్యకలాపాల ప్రారంభం ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.