Finnish Woman : ఫిన్లాండ్ అమ్మాయి.. హైదరాబాద్ అబ్బాయి.. యాహూ ఛాట్‌లో మొదలైన వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫిన్లాండ్ అమ్మాయి తెలుగులో ఎంచక్కా మాట్లాడుతోంది. తెలుగు వాళ్లంతా గర్వించేలా చేస్తోంది. ఈ ప్రేమ, పెళ్లి, ఫిన్లాండ్ అమ్మాయి తెలుగు భాష నేర్చుకోవడంతో ముడిపడిన వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
Also Read :What is Bharatpol : ‘భారత్ పోల్’ విడుదల.. రాష్ట్రాల పోలీసు విభాగాలకు గుడ్ న్యూస్
రైతా మోచెర్ల ఫిన్లాండ్(Finnish Woman)లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. ఆమెకు ఆంగ్లం, స్వీడిష్, జర్మన్, రష్యన్ భాషలు వచ్చు. ఆంగ్ల భాషపై పట్టును పెంచుకునేందుకు ఆమె యాహూ ఛాట్‌లోకి వెళ్లినప్పుడు 1997లో మన హైదరాబాద్‌కు చెందిన ప్రదీప్ పరిచయమయ్యాడు. మీ మాతృభాష ఏది అని ప్రదీప్‌ను రైతా అడిగింది. ‘తెలుగు’ అని ప్రదీప్ బదులిచ్చాడు. దీంతో తెలుగును కూడా నేర్చుకోవాలని ఆమె డిసైడ్ అయ్యింది. ఫిన్లాండ్‌లో ఉండే ఓ ప్రొఫెసర్ సహకారంతో ఒక పుస్తకాన్ని తెప్పించుకొని తెలుగు భాషను రైతా నేర్చుకుంది. ఇక తెలుగుభాషలో ప్రదీప్‌తో రైతా ఛాటింగ్ మొదలుపెట్టింది. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం నాలుగేళ్లలో ప్రేమగా మారింది. ఆ తర్వాత ప్రదీప్ మాస్టర్స్ చేయడానికి లండన్‌కు వెళ్లాడు.
Also Read :Formula E Car Race Case : జనవరి 16న విచారణకు రండి.. కేటీఆర్‌కు మరోసారి ఈడీ నోటీసులు
ఆ టైంలో విమానాశ్రయంలో తొలిసారిగా రైతా మోచెర్లను ప్రదీప్ చూశాడు. పెద్దలకు చెప్పి.. పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ టైంలో రైతా లండన్‌లోనే బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తోంది. ప్రదీప్, రైతా అక్కడే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ దంపతులకు నలుగురు పిల్లలు. ఇటీవలే చాలా తెలుగు యూట్యూబ్ ఛానళ్లు రైతా మోచెర్లను ఇంటర్వ్యూ చేశాయి. వాటిలో రైతా అచ్చ తెలుగులో మాట్లాడారు. తెలుగు పదాలను చక్కగా వినియోగిస్తూ ఇంటర్వ్యూయర్ వేసిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు.