First Nomination : తెలంగాణ శాసనసభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన కాసేపటికే తొలి నామినేషన్ దాఖలైంది. తొలి నామినేషన్ ఎవరు వేశారో తెలుసా ? శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల స్వీకరణను ప్రారంభించారు. అయితే ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు ఉదయం 11 గంటలకే రిటర్నింగ్ అధికారి (ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్) కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
నిర్మల్ బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా దాదాపు 11.30 గంటలలోపే నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. కోదాడ నియోజకవర్గం నుంచి సుధీర్ కుమార్ జలగం అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా ఆన్‌లైన్‌లో తొలి నామినేషన్ సమర్పించారు. ఇవాళ్టి నుంచి నవంబర్ 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 13 వరకు నామినేషన్లను పరిశీలించనున్నారు. నవంబర్ 15 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత రోజువారీ నామినేషన్ల వివరాలను(First Nomination) వెల్లడిస్తారు.
Also Read: Durgamma Temple: దుర్గమ్మ ఆలయం హుండీ లెక్కింపు, 14.71 కోట్ల ఆదాయం
- అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌కు చెందిన సువిధ పోర్టల్ ద్వారానూ నామినేషన్లను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఆన్‌లైన్‌లో నామినేషన్ సమర్పించినా అభ్యర్థి ఆ ప్రతిపై సంతకంచేసి నిర్దిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది.
- విదేశాల్లో ఉండే భారతీయులు అక్కడి నుంచే నామినేషన్ దాఖలు చేస్తే అక్కడి భారత రాయబార కార్యాలయాలు, కాన్సుల్ కార్యాలయాల్లో ప్రమాణం చేయాల్సి ఉంటుంది.
- ఈరోజు నుంచే 119 నియోజకవర్గాలకు 60 మంది ఎన్నికల వ్యయ పరిశీలకులు రంగంలోకి దిగనున్నారు. 39 మంది ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించారు.
- నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.
- డిసెంబర్ 3న ఓట్లను లెక్కిస్తారు. ఆ రోజున ప్రజా తీర్పు తెలిసిపోతుంది.