తెలంగాణ రాష్ట్ర పశువర్దక శాఖ కార్యాలయం (Telangana Animal Husbandry Department)లో ముఖ్యమైన ఫైల్స్ మాయం (Files Lost) కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ లో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే బిఆర్ఎస్ (BRS) నేతల అవినీతిని బయటపెడతామని..పదేళ్లుగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఆరోపించింది. ఇక ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ రావడం తో అవినీతిపై ఫోకస్ చేసారు. పలు శాఖలకు సంబదించిన వివరాలను సేకరించేపనిలో పడ్డారు. ఈ క్రమంలో పలు శాఖలకు సంబదించిన కార్యాలయాల్లో ముఖ్యమైన ఫైల్స్ మాయం కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా రాష్ట్ర పశువర్దక శాఖ కార్యాలయంలో ముఖ్యమైన ఫైల్స్ మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ముసబ్ ట్యాంక్ వద్ద ఉన్న కార్యాలయంలో కిటికీ గ్రిల్స్ తొలగించి ఫైల్స్ మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై సెంట్రోల్ జోన్ డీజీపీ శ్రీనివాస్ పిర్యాదు చేసారు. ఫైల్స్ మిస్సింగ్ పై ఓఎస్డీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ లపై అధికారులు అనుమానం వ్యక్తం కేసు నమోదు చేసారు. అంతే కాదు కార్యాలయంలో సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరి ఆ ఫైల్స్ దేనికి సంబందించినవి..? అందులో ఎలాంటి వివరాలు ఉన్నాయో..? వాటిని ఎవరు ఎత్తుకెళ్లారు..? ఎవరికీ ఇచ్చారు..? ఏంచేశారు..? వంటివి తెలియాల్సి ఉంది.
Read Also : Kashvee Gautam: డబ్ల్యూపీఎల్ వేలంలో రికార్డు సృష్టించిన కశ్వీ గౌతమ్.. ఎవరు ఈ క్రీడాకారిణి..?