DSC Exam : డీఎస్సీ హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఈ నెల 18 నుంచి జరగనున్న డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలకు రెడీ అవుతున్నారు. అయితే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్న కొందరు అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. తాము ఒక జిల్లాలో అప్లై చేస్తే.. మరో జిల్లాలోని పోస్టుకు ఆప్షన్లు ఇచ్చుకున్నట్లుగా చూపించడంతో వారు కలత చెందుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
- ఉదాహరణకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ అభ్యర్థిని డీఎస్సీలో(DSC Exam) అదే జిల్లాలో ఎస్‌ఏ పోస్టుకు అప్లై చేసుకుంది. ఆమెకు కరీంనగర్‌లో ఈ నెల 24న పరీక్ష ఉంది. అయితే హాల్ టికెట్‌లో మాత్రం ఖమ్మం జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకున్నట్లుగా ఉండటాన్ని చూసి సదరు అభ్యర్థిని ఆందోళనకు గురవుతోంది. చాలామందికి ఇలాగే హాల్ టికెట్లలో తప్పులు వచ్చాయని, దీనిపై హెల్ప్‌డెస్క్‌కు ఫిర్యాదు చేశామని సదరు అభ్యర్థిని తెలిపారు. దీనిపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి పొరపాటును సరిచేయాలన్నారు.
- మంచిర్యాల జిల్లాకు చెందిన మరో అభ్యర్థిని మంచిర్యాల జిల్లాలోనే ఎస్జీటీ పోస్టుకు అప్లై చేశారు. ఆమెకు ఈ నెల 19న డీఎస్సీ పరీక్ష ఉంది. కానీ ఆమె నల్గొండ జిల్లాలో పోస్టుకు అప్లై చేసినట్లుగా హాల్ టికెట్‌లో ప్రస్తావించారు. ఇక ఎగ్జామ్ సెంటరును ఆదిలాబాద్ జిల్లాలో కేటాయించారు. ఈనెల 18 నుంచి ఆగస్టు 5వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.
Also Read :Donald Trump : హాస్పటల్ నుండి డోనాల్డ్ ట్రంప్ డిశ్చార్జ్
డీఎస్సీ పరీక్ష తెలంగాణ సర్కారుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతుంటే.. వాయిదా వేసే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెబుతోంది. టెట్ పరీక్షకు డీఎస్సీ ఎగ్జామ్‌కు(DSC Hall Tickets) అతి తక్కువ రోజుల గ్యాప్ ఉండటంతో ప్రిపరేషన్‌కు ఇబ్బందిగా మారిందని నిరుద్యోగులు వాదిస్తున్నారు. గ్రూప్-1 పోస్టులకు 1:100 నిష్పత్తిలో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని అంటున్నారు.