Harish Rao: రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది : మాజీ మంత్రి హరీశ్ రావు

  • Written By:
  • Updated On - April 27, 2024 / 11:49 PM IST

Harish Rao: కరీంనగర్‌లో ప్రెస్ మీట్ మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతే పదవి పోతుందనే భయం స్పష్టంగా కనిపిస్తోందని హరీశ్ రావు అన్నారు. దేవుళ్లపై ఒట్టు పెట్టుకుంటూ రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడని, ఎన్నికల హమీల గురించి, నాలుగు నెలల పాలన గురించి మాట్లాడడం లేదని హరీశ్ రావు మండిపడ్డారు.

‘‘బాండు పేపర్లు నాటకం నడవదని దేవుళ్లపై ఒట్లు పెడుతున్నాడు. బీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. దొంగే దొంగ అన్నట్టున్నాయి ఆయన మాటలు. బీజేపీతో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నది రేవంత్. హుజారాబాద్‌, దుబ్బాక, మునుగోడుల్లో బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీ గెలవడానికి పరోక్షంగా సహకరించింది రేవంత్. నాగార్జన సాగర్ లోనూ ఆ రెండు పార్టీలు సహకరించుకున్నాయి’’ అని హరీశ్ రావు ఆరోపించారు.

‘‘రిజర్వేషన్ల రద్దుకు బీఆర్ఎస్ బీజేపీకి సహకరిస్తుందని రేవంత్ అంటున్నాడు. తమిళనాడులో మాదిరిగా రిజర్వేషన్ పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది బీఆర్ఎస్.  పార్లమెంటులో కొట్లాడింది మేం. రేవంత్‌ది అతితెలివి లేదా మతి మరుపు. గ్లోబెల్స్ ప్రచారంతో ఎంపీ ఎన్నికల గండం గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నాడు.
హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచుతామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని మోదీ అంటున్నడు’’ అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.