Telangana : చాంద్రాయ‌గుట్ట నుంచి నామినేష‌న్లు దాఖ‌లు చేసిన తండ్రికొడుకులు.. కార‌ణం ఇదే..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుంది. నామినేష‌న్ల‌కు రేపు చివ‌రి రోజు కావ‌డంతో ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల‌తో

  • Written By:
  • Publish Date - November 9, 2023 / 09:48 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుంది. నామినేష‌న్ల‌కు రేపు చివ‌రి రోజు కావ‌డంతో ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల‌తో పాటు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు నామినేషన్లు వేసేంద‌కు సిద్ద‌మైయ్యారు. ఇటు హైద‌రాబాద్ పాతబస్తీలో ఎన్నిక‌ల ఈ సారి ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నున్నాయి. ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, ఆయన కుమారుడు డాక్టర్ నూరుద్దీన్ ఒవైసీలు ఇద్ద‌రూ నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. చాంద్రాయ‌ణ‌గుట్ట నుంచి తండ్రి కొడుకులు నామినేష‌న్ దాఖ‌లు చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఏదైనా కారణాల వల్ల తమ నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురైతే అభ్యర్థులకు బ్యాకప్ నామినీ ఉంటుందని ఎంఐఎం నేత‌లు చెబుతున్నారు. అటువంటి పరిస్థితులలో రాజకీయ పార్టీ లేదా అభ్యర్థితో సంబంధం ఉన్న బ్యాకప్ అభ్యర్థి ఎన్నికలలో పోటీ చేస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

అదేవిధంగా AIMIM అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు నూరుద్దీన్‌ను డ‌మ్మీ అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేయించిన‌ట్లు తెలిపారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అక్బర్ వరుసగా ఆరోసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 1999లో చాంద్రాయణగుట్ట నుండి ఎంబిటి నాయకుడు మహ్మద్ అమానుల్లా ఖాన్‌పై విజయం సాధించి శాసనసభకు అరంగేట్రం చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ కుమారుడు డాక్టర్ నూరుద్దీన్ ఒవైసీపై ఎలాంటి కేసులు లేవు. బంజారాహిల్స్‌లో రూ. 1.25 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ. 77 లక్షలు విలువ చేసే ఇల్లు ఉన్న‌ట్లు అఫ‌డ‌విట్‌లో పేర్కోన్నారు. వీరిద్దరూ గత కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల్లో ప్ర‌చారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Also Read:  T Congress : తెలంగాణలో కాంగ్రెస్‌ హవా న‌డుస్తుంది : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్య‌ర్థి అజారుద్దీన్‌

ఇటు ఎంఐఎం పార్టీ త‌మ అభ్య‌ర్థులు ప్ర‌క‌టించింది. జాఫర్ హుస్సేన్ మెరాజ్ (యాకుత్‌పురా), మహ్మద్ మాజిద్ హుస్సేన్ (నాంపల్లి), అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల (మలక్‌పేట్), కౌసర్ మొహియుద్దీన్ (కార్వాన్) సహా అభ్యర్థులు తమ నియోజకవర్గాల నుంచి భారీ ర్యాలీలు నిర్వహిస్తూ సంబంధిత రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ) వద్ద నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు జూబ్లీహిల్స్‌ నుంచి మొహమ్మద్‌ రషీద్‌ ఫరాజ్‌, రాజేంద్రనగర్‌ నుంచి రవి యాదవ్‌ పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. పార్టీకి చెందిన తొమ్మిది మంది అభ్యర్థుల్లో బహదూర్‌పురా నుంచి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.