Site icon HashtagU Telugu

Road Accident : ORR పై ఘోర ప్రమాదం.. వరుసగా ఢీకొన్న 7 కార్లు

Orr Accident

Orr Accident

హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డు(ORR)పై హిమాయత్ సాగర్ సమీపంలో వరుసగా ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకున్న ఘటన ఆదివారం ఉదయం సంచలనం సృష్టించింది. రాజేంద్రనగర్ నుంచి పోలీస్ అకాడమీ వైపు వెళ్తున్న వాహనాలు అనూహ్యంగా నిలిచిపోవడంతో పైనుంచి వచ్చిన వాహనాలు బ్రేకులు వేయలేక ముందువాహనాలను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పలు కార్లు తీవ్రంగా ధ్వంసమవగా కొంతమంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు.

Danam Nagender Resign : రాజీనామాకు సిద్ధమవుతున్న దానం?

సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు జరిపి ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ORR పై వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు అదనపు సిబ్బందిని మోహరించినట్లు పోలీసులు తెలిపారు.

ఇటీవల ఔటర్ రింగ్ రోడ్డుపైకి గేదెలు రావడం పెరిగిపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని నెటిజన్లు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా హిమాయత్ సాగర్, రాజేంద్రనగర్, షంషాబాద్ దిశల్లో రాత్రి వేళల్లో పశువులు రోడ్డుపైకి రావడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని వారు పేర్కొంటున్నారు. పశువులను రోడ్డుపైకి రానీయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, రక్షణ కంచెలను బలపరచాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version