సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మైహోమ్ సిమెంట్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్‌లో 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి ఐదుగురు కూలీలు అక్కడిక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన కార్మికులుగా తెలుస్తుంది. బ్రతుకుదెరువు కోసం ఇక్కడికి పని కోసం వచ్చి ఇలా ప్రమాదంతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది.
ప్రాణాలు కోల్పోయిన కార్మికులు లిఫ్ట్ లోనే ఇరుక్కోగా మిగతా కార్మికులు వారి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై మై హోమ్ యాజమాన్యం గోప్యత పాటిస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Read Also : Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన కలెక్టర్