Kodad Road Accident : లారీని ఢీకొట్టిన కారు.. ఆరుగురి దుర్మరణం

Kodad Road Accident : ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో ఆరుగురు ఆరుగురు చనిపోగా, ఇద్దరికి గాయాలయ్యాయి. 

  • Written By:
  • Updated On - April 25, 2024 / 09:56 AM IST

Kodad Road Accident : ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో ఆరుగురు ఆరుగురు చనిపోగా, ఇద్దరికి గాయాలయ్యాయి.  ఈ ప్రమాద ఘటన గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పట్టణంలోని దుర్గాపురం స్టేజీ వద్ద  చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join

లారీ బ్రేక్‌డౌన్ కావడంతో డ్రైవర్ దాన్ని రోడ్డు పక్కకు నిలిపివేశాడు. అయితే  హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న కారు డ్రైవర్.. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో రోడ్డుపక్కన పార్క్ చేసిన ఆ లారీని గమనించలేదు. దీంతో కారు వేగంగా వెళ్లి నిలబడి ఉన్న లారీని వెనుక భాగంలో ఢీకొట్టింది. దీంతో కారులోని మొత్తం 8 మందిలో ఆరుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే  చనిపోయారు. మృతుల్లో ఒక మహిళ, మరో చిన్నారి ఉంది.  కారు అతివేగం, డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. లారీ కింద ఇరుక్కుపోయిన కారు‌ను స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీశారు. ప్రమాద ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఇక గాయపడిన ఇద్దరికి కూడా అదే ఆస్పత్రిలో చికిత్స(Kodad Road Accident) అందిస్తున్నారు.

Also Read : Vastu Tips: వాస్తు ప్ర‌కారం మీ ఇంట్లో ఏ వ‌స్తువుల‌ను ఏ దిశ‌లో ఉంచాలో తెలుసా..?

ఇక బుధవారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతిచెందారు. వర్ధన్నపేట నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న బైకును వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న నలుగురు విద్యార్థులు మృతిచెందారు. ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, మరొకరికి గాయాలయ్యాయి.  మృతులను వరుణ్‌ తేజ, సిద్దు, గణేశ్‌, రనిల్‌కుమార్‌గా గుర్తించారు.

Also Read :What Is Insulin: ఇన్సులిన్ అంటే ఏమిటి..? ఇది డ‌యాబెటిక్ స‌మ‌స్య ఉన్న‌వారికి ఉప‌యోగ‌ప‌డుతుందా..?