తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూరియా కొరత (Urea Shortage) తీవ్రంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో యూరియా కొరత ఎప్పుడూ ఎదుర్కోలేదని, ఇప్పుడు అర్ధరాత్రి నుంచే యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంతో పాటు, లింగాపూర్, పాలమాకుల గ్రామాల్లో యూరియా కోసం రైతులు భారీ క్యూ లైన్లలో నిలబడ్డారు. కొత్తగూడలో అర్ధరాత్రి నుంచే రైతులు పీఏసీఎస్ కేంద్రం వద్ద వేచి ఉన్నారు. లింగాపూర్లో, కేవలం టోకెన్లు ఉన్న కొద్దిమందికి మాత్రమే యూరియా ఇస్తామని చెప్పడంతో, మిగతా రైతులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అలాగే, సిద్దిపేట జిల్లా పాలమాకుల రైతు వేదిక వద్ద వందలాది మంది రైతులు బారులు తీరారు. అయితే, అక్కడున్న యూరియా బస్తాల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో రైతులు నిరసన చేపట్టారు.
Minister Narayana : చెత్త పన్ను వేసిన చెత్తను తొలగించని చెత్త ప్రభుత్వం వైసీపీ
యూరియా సరఫరాలో జరుగుతున్న జాప్యం, కొరతపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే నిరీక్షిస్తున్నా యూరియా దొరకకపోవడంతో రైతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ రైతులకు అవసరమైనంత యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలంలో PACS కేంద్రం వద్ద యూరియా కోసం అర్ధరాత్రి నుండే రైతుల పడిగాపులు
లింగాపూర్ గ్రామంలో యూరియా బస్తాల కోసం మెట్ పల్లి సింగిల్ విండో సిబ్బందితో వాగ్వాదానికి దిగిన రైతులు
450 బస్తాల యూరియా లోడ్ వస్తుందని తెలుసుకుని ఉదయాన్నే గోదాం వద్దకు తరలివచ్చిన… pic.twitter.com/cfsOH2cPPR
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2025