రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్‌లోని జన్నారం ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. తాము సాగు చేసిన పంటలకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో పంట దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డు దిగ్బంధనంతో రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్నికల సమయంలో తమ వద్దకు ఓట్ల కోసం వచ్చే రాజకీయ నేతలకు సకాలంలో సరిపడా యూరియా సరఫరా చేసి, ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుంటే వారికి గుణపాఠం చెబుతామని రైతులు హెచ్చరించారు. ఎరువుల డీలర్లు యూరియాతో పాటు డీఏపీ కూడా కొనుగోలు చేయాలన్న షరతుతో యూరియాను విక్రయిస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. ఓ వైపు నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే.. మరోవైపు ఉన్న పంటల్ని ఎలాగో అలా కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బోర్ల ద్వారా నీళ్లు పెట్టుకుని పంటలు ఎండిపోకుండా కాపాడుకుంటున్నారు. అయితే ఎరువులు సకాలంలో అందకపోవడంతో పంట దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.