Site icon HashtagU Telugu

Farmers Celebrating : తెలంగాణలో అంబరాన్ని తాకుతున్న రైతుల సంబరాలు

Farmers Happy

Farmers Happy

కాంగ్రెస్ పార్టీ (Congress Party) మాట ఇస్తే తప్పదని మరోసారి రుజువు చేసారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా ఆనాడు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చి మాట నిలబెట్టుకుంది. వరంగల్‌లో 2022 మే 6న నిర్వహించిన రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రైతు రుణమాఫీ హామీ ఇచ్చి ఈనాడు ఆ హామీని నిలబెట్టుకొని..కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని రుజువు చేసారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎక్కడిక్కడే సోనియా గాంధీ , రాహుల్ గాంధీ , సీఎం రేవంత్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ తమ అభిమానాన్ని , సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డిని హనుమంతుడితో పోల్చుతూ ‘ఈ రేవంతు.. తెలంగాణ రైతులందరి హనుమంతు!’ అంటూ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసారు. ‘హనుమాన్’ మూవీలోని బీజీఎం, విజువల్స్తో ఎడిట్ చేసిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది.

ఇక రుణమాఫీ సంధర్బంగా గత పాలకుల ఫై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గత పాలకులు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు సార్లు మాట తప్పారని, మొదటి ఐదేళ్లలో కేసీఆర్ రూ. 16 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి రూ. 12 వేల కోట్లు మాత్రమే చేశారని సీఎం గుర్తు చేశారు. రెండోసారి రూ. 12 వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పి రూ. 9 వేల కోట్లు మాత్రమే చెల్లించారని వివరించారు. కానీ, తాము సచివాలయంలో కూర్చొని ధైర్యంగా తెలంగాణ రైతులకు రూ. 6,098 కోట్లు రూపాయాలను రుణమాఫీ ఖాతాల్లో వేశామని తెలిపారు.

Read Also : Runa Mafi : రూ.ల‌క్ష రుణ‌మాఫీలో అందోల్..మొదటి స్థానం