Site icon HashtagU Telugu

CM KCR In Delhi: రైతులు తలచుకుంటే ప్రభుత్వాలు కూలుతాయ్..కేంద్రానికి సీఎం కేసీఆర్ వార్నింగ్..!!

Cm Kcr kejriwal bhagwant maan

Cm Kcr kejriwal bhagwant maan

రైతులు తలచుకుంటే…ప్రభుత్వాలు కూలుతాయి. ఎంతటి శక్తివంతులనైనా మెడలు వంచే సత్తా రైతులకు ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఆదివారం పంజాబ్ లో రైతు అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు కీలక కామెంట్స్ చేశారు.

రైతులకు మంచి చేసే రాష్ట్ర ప్రభుత్వాలంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి అస్సలు పడదని విమర్శించారు. ఏదోవిధంగా వారిని ఇబ్బంది పెట్టేలా ప్లాన్ చేస్తుందని మండిపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతులందరూ ఏకతాకిపైకి రావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

రైతులకు ప్రభుత్వాలను మార్చే శక్తి ఉందన్నారు. తాము ఒంటరయ్యామని రైతు కుటుంబాలు ఆందోళన చెందవద్దని…తామంతా అండగా ఉన్నామని భరోసానిచ్చారు. దేశవ్యాప్తంగా రైతులు చేసే ఉద్యమానికి తమ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెప్పారు. చండీగఢ్ లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుంబాలను, గాల్వాన్ సరిహద్దు లో అసువులుబాసిన సైనిక కుటుంబాలను కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్శంగా 6వందల కుటుంబాలకు 3లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.