Site icon HashtagU Telugu

Farmer Suicide : డిప్యూటీ సీఎం ఇలాకాలో పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య

Farmer Suicide

Farmer Suicide

ఇందిరమ్మ రాజ్యం వచ్చింది..ఇది రైతన్న రాజ్యం..ఇక రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండవు..నిరుద్యోగుల బలిదానాలు ఉండవు..పెన్షన్ల కోసం ఎదురుచూపులు ఉండవు..అధికారుల నిర్లక్ష్యం ఉండదు..ఇక అంత మంచి రోజులే అంటూ చెప్పుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..చెప్పేది ఒకొట్టి చేసేది ఒకటి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత మూటకట్టుకుంటుంది. ప్రజలు ఆగ్రహం తో మండిపడుతున్నారు. నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇరాక్ రైతుల బాధలు కూడా అంటే..గత ఏడాది వర్షాలు లేవు..గిట్టుబాటు ధర లేదు..ఇక ఇప్పుడు విత్తనాలు , ఎరువులు అందజేయడం లేదని ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తున్నారు. ఇలా ఇవన్నీ ఉండగానే తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకాలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య (Darmer suicide in khammam district) చేసుకోవడం జిల్లా వ్యాప్తమగా సంచలనం రేపుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం ఫై ఇప్పుడు ప్రభుత్వాన్ని మరింత విమర్శల పాలుచేస్తుంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు భోజడ్ల ప్రభాకర్‌కు కొంత వ్యవసాయ భూమి ఉంది. అయితే, ఆ భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారంటూ ప్రభాకర్ ఇటీవల ఎమ్మార్వో, ఎస్సైకి ఇతర అధికారులకు ఫిర్యాదు చేశాడు. కానీ, వారు పట్టించుకోకపోవడం తో వారి ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి..తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన పొలాన్ని కాపాడుకునే మార్గం లేదంటూ కన్నీరుమున్నీరయ్యాడు.

తనకు ఇక ఆత్మహత్యే శరణ్యమని నిర్ణయం తీసుకొని పురుగుల మందు తాగుతూ.. ఓ సెల్ఫీ వీడియో చేశాడు. అందులో.. ‘రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆ వీడియో తన గోడును వెల్లబోసుకుంటూ రైతు ప్రభాకర్ ప్రాణాలు విడిచాడు. ప్రస్తుతం ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

Read Also : Jagan New Look : సరికొత్త లుక్ లో జగన్..వావ్ అంటున్న వైసీపీ శ్రేణులు