Site icon HashtagU Telugu

Loan Waiver : రేపు సాయంత్రం నుండి రైతురుణాల మాఫీ ప్రారంభం: సీఎం రేవంత్‌ రెడ్డి

Farmer loan waiver will start from tomorrow evening: CM Revanth Reddy

Farmer loan waiver will start from tomorrow evening: CM Revanth Reddy

Farmer Loan Waiver: ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy)అధ్యక్షతన జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతురుణాలు మాఫీ చేస్తున్నామన్నారు. రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయి. నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తాం. ఆగస్టు లో రూ.2లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు. ప్రతీ రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రుణమాఫీ కేసీఆర్‌ లాగా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడంలేదన్నారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంది. అందుకే ఏకమొత్తంలో రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామన్నారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ.2లక్షల రైతు రుణమాఫీ. మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించండని నాయకులతో అన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించండి. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పండి. రుణమాఫీపై జాతీయస్థాయిలో చర్చ జరగాలి. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేయలేదు. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారెంటీని అమలు చేశామని పార్లమెంట్ లో ఎంపీలు ప్రస్తావించాలి. రేపు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణంలో సంబరాలు జరపాలి. ఏడు నెలల్లో మన ప్రభుత్వం సంక్షేమానికి రూ.30వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.

Read Also: Amazon Offers: ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. కేవలం రూ.20 వేలకే ఐఫోన్?

కాగా, 2022 మే 6 న వరంగల్‌ డిక్లరేషన్‌ ద్వారా రాహుల్‌ గాంధీ రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ రూ.28 వేల కోట్లు రైతు రుణమాఫీ చేయలేకపోయారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పాం..ఆర్ధిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారు.. ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారు. పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియా గాంధీ ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం. రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత అని సీఎం రేవంత్ అన్నారు. ఈ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలి. వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్ ను దేశం అనుసరించేలా ఉండాలి. నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Read Also: Doda Attack: జైపూర్‌ చేరుకున్న సైనికుల మృతదేహాలు