Rythu Bharosa : సాగు భూమికి మాత్రమే రైతు భరోసా ..?

రాళ్లు, రప్పలు, వెంచర్లకు కూడా కేసీఆర్ సర్కార్ పెట్టుబడి సాయం అందించిందని.. మేం అలా చేయమని చెప్పకనే చెపుతుంది

  • Written By:
  • Publish Date - June 26, 2024 / 04:14 PM IST

రైతు భరోసా (Rythu Bharosa) ఎవరికీ వస్తుందో..ఎవరికీ రాదో..ప్రభుత్వం ఎవరికీ ఇస్తుందో..ఎవరికీ ఇవ్వదో అని రైతులంతా ఆందోళనలో ఉన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం గుంట భూమి దగ్గరి నుండి వందల ఎకరాలు ఉన్న వారికీ కూడా రైతు బంధు వేసింది..అలాగే సాగు చేసే వారికే కాదు మాములుగా బీడు భూమికి కూడా రైతు భరోసా డబ్బులు వేసింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం సాగు చేసే వారికీ మాత్రమే రైతు భరోసా కల్పిస్తామని ముందు నుండి చెపుతూ వస్తుంది. ఇప్పుడు అదే చేసేందుకు సిద్ధమైంది.

రాష్ట్రంలో రైతుబంధు స్థానంలో ప్రభుత్వం రైతు భరోసా పథకం తీసుకొస్తున్న దృష్ట్యా పెట్టుబడి సాయం కూడా సంవత్సరానికి ఎకరాకు రూ.15,000 చొప్పున అందజేయనున్నామని కాంగ్రెస్ తెలిపింది. గత ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు ఇస్తే కాంగ్రెస్​ ప్రభుత్వం అదనంగా మరో రూ.5 వేలు పెంచి అందజేయబోతుందని తెలిపారు. అయితే.. రాళ్లు, రప్పలు, వెంచర్లకు కూడా కేసీఆర్ సర్కార్ పెట్టుబడి సాయం అందించిందని.. మేం అలా చేయమని చెప్పకనే చెపుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

కేవలం సాగు భూమికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. సాగు చేయని వ్యవసాయ భూములకు రైతు భరోసా నిలిపివేసే అవకాశం ఉందని సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి విధివిధానాల రూపకల్పనకు రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు సమాచారం. ప్రత్యేక ఫార్మాట్‌లో రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం పంట భూములను సైతం పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఏ పథకమైనా అర్హులకు మాత్రమే అందాలి. అప్పుడే కదా.. టాక్స్ పేయర్స్ మనీకి విలువ ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం నిధులు పక్కదారి పట్టాయి అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు భరోసా పథకాన్ని మాత్రం.. అలా నీరు గార్చే ప్రసక్తే లేదు అంటోంది. అనర్హులను ఏరివేసి.. నిజమైన రైతులకే దాన్ని అమలుచేస్తామంటోంది. పూర్త పారదర్శకంగా ఈ స్కీమ్ అమలుచేస్తామని తెలిపింది. ఈ స్కీమ్‌కి సంబంధించి ప్రభుత్వం.. గ్రామాల వారీగా సాగు భూమి ఎంత?, రియల్ ఎస్టేట్ భూములు ఎన్ని ఉన్నాయి, కొండలు, గుట్టలు ఎన్ని ఉన్నాయి, సాగులో లేని దేవాదాయ, వర్ఫ్ భూములు ఏవి ఉన్నాయి? వంటి వివరాల్ని సేకరించేందుకు వ్యవసాయ శాఖ పూర్తిస్థాయిలో 3 రోజులుగా సర్వే చేస్తోంది. వచ్చే వారంలో ఈ సర్వే పూర్తవుతుంది. దీనిని బట్టి రైతు భరోసా వేయనున్నారు.

Read Also : Pinnelli Ramakrishna Reddy : వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్..?