Site icon HashtagU Telugu

Farmer Suicide : “నా చావుకు సీఎం కేసీఆర్ సారే కారణం” అంటూ యువరైతు ఆత్మహత్య

Farmer Suicide

Farmer Suicide

రైతు బంధు (Rythu Bandhu)సాయం తమకు రావడం లేదని మనోవేదనకు గురై ఓ యువ రైతు (Farmer Suicide) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ (Adilabad) ​జిల్లా జైనథ్ మండలంలో బోరజ్ గ్రామంలో జరిగింది. రమాకాంత్ (Ramakanth) అనే యువకుడు గురువారం సాయంత్రం బోరజ్ గ్రామ శివారులో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు మృతి చెందిన స్థలంలో ఓ సూసైడ్ నోట్ దొరికింది.

We’re now on WhatsApp. Click to Join.

“అవ్వ బాపు నన్ను క్షమించండి. తప్పయ్యింది. చెల్లి, బావ మీకంటే నాకు ఎవరూ లేకుండె. సీఎం కేసీఆర్ (CM KCR) సార్​ భూమి ఉన్నోళ్లకు రైతుబంధు ఇస్తున్నరు. మా ఊరిలో నాలాంటి చాలా మంది దళితులు ఉన్నరు. నా చావుకు మీరే కారణం” అంటూ సూసైడ్ నోట్‌లో తనకు వచ్చిన భాష, పదాలతో రాసాడు.

సీఎం కేసీఆర్ రైతులకు రైతు బంధు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే భూమి ఉన్న రైతులకే రైతు బంధు ఇస్తున్నాడు కానీ కౌలు రైతు చేసుకునేవారికీ ఎలాంటి సాయం చేయడం లేదు. చాలామంది రైతులు సొంతంగా వ్యవసాయం చేయడం ఎప్పుడో మానేశారు. తమ భూమిని కౌలు కు ఇచ్చి పంటలు పండించుకుంటున్నారు. కేసీఆర్ అందిస్తున్న రైతుబంధు..కేవలం భూమి యజమానులకు అందుతుంది. భూమి లేని రైతులు, కౌలు రైతులకు ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదు. ఈ క్రమంలోనే వ్యవసాయం చేసే కౌలు రైతులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు ఈ యువ ప్రాణం కూడా అలాగే కోరుకుంటూ ప్రాణం విడిసింది.

Read Also : TS RTC : అయ్యప్ప భక్తులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్