Site icon HashtagU Telugu

Pawan Election Campaign : అబ్బే..పవన్ ఇది సరిపోదు..డైలాగ్స్ గట్టిగా పడాలి

Pawan Wgl

Pawan Wgl

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పీచ్ (Speech) కు ప్రత్యేకమైన అభిమానులుంటారు. మూసగా మొదలుపెట్టి..ఆ తర్వాత వేగం పుంజుకొని..చివర్లో ఓ ఊపేస్తారు పవన్. అందుకే పవన్ స్పీచ్ అంటే అభిమానులు , కార్యకర్తలే కాదు రాజకీయ నేతలు సైతం ఆసక్తి కనపరుస్తుంటారు. తాజాగా ఆయన వరంగల్ (Warangal) సభలో చేసిన ప్రసంగం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో బిజెపి (BJP) తో కలిసి జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 8 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా..మిగతా స్థానాల్లో బిజెపి కి సపోర్ట్ చేస్తుంది. ఈ తరుణంలో నిన్న బుధువారం నుండి పవన్ ప్రచారంలోకి అడుగుపెట్టారు. పవన్ బయటకు వస్తున్నాడంటే ఇక జనసంద్రమే..రూపాయి ఖర్చు పెట్టనవసరం లేదు..వాహనాలు పెట్టి జనాలను తరలించాల్సిన అవసరం లేదు. సొంత ఖర్చు తో పవన్ సభకు వస్తారు. అది తెలంగాణ లో జరిగిన.. ఏపీలో జరిగిన ..సభ ఎక్కడైనా సరే జనాలు భారీగా తరలివస్తారు. నిన్న వరంగల్ సభకు కూడా జనాలు తరలివచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక పవన్ ప్రసంగం కోసం అంత ఎదురుచూసారు. కానీ పవన్ మాత్రం తన ప్రసంగంలో పంచ్ డైలాగ్స్ లేకుండానే ప్రసంగాన్ని ముగించడం అభిమానులు తట్టుకోలేకపోయారు. అసలు మాట్లాడుతోంది పవన్ కల్యాణేనా అన్న అనుమానం ఆయన అభిమానుల్లో కనిపించింది. మొదటిరోజు మీటింగ్ లో మోడీని పొగడటానికి.. తెలంగాణ పౌరుషమే ఆంధ్రలో పోరాడటానికి పనికొచ్చింది అని చెప్పుకోవడమే గానీ పెద్దగా పవర్ పంచ్ లు రాకపోవడంతో ఆయన ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. గతంలో వైఎస్సార్ ని పంచులూడకొడతానని ఆవేశంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గానీ, సీఎం కేసీఆర్ ను గానీ పల్లెత్తు మాట అనకుండా కూల్ గా మాట్లాడారు. ఆత్మ బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం అవినీతిమయం అయిందనీ.. తెలంగాణ స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలతో పోరాటం చేస్తున్నానని అన్నారు. కానీ ఇంకా పెద్దగా ఏమి మాట్లాడలేదు. దీంతో పవన్ తన ప్రసంగాలలో స్పీడ్ పెంచాలని , పంచ్ డైలాగ్స్ పడాలని బిజెపి నేతలు అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : KTR Phone Call Leaked : వైరల్ గా మారిన కేటీఆర్ ఫోన్ కాల్..సిరిసిల్లలో కష్టమేనా..?