Site icon HashtagU Telugu

TRS Family:టీఆర్ఎస్ లో ఫ్యామిలీ పాలిటిక్స్.. కేటీఆర్, కవితలలో ఎవరి పరిధి ఏమిటి?

Kcr, Ktr, Kavitha, Trs

Kcr, Ktr, Kavitha, Trs

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలిట్రిక్స్ మామూలుగా ఉండవు. కుటుంబ రాజకీయాలు అని ప్రతిపక్షాలు తరచూ విమర్శించినా సరే.. వాళ్లు ప్రజా ప్రతినిధులని.. ఓట్లేసి గెలిపించారని అంటుంటారు. నిజమే కాని.. ఇప్పుడు కుటుంబంలో మాత్రం అధికారం కోసం వార్ నడుస్తోందని.. కాకపోతే ఈ విషయంలో ఎవరి పరిధి ఏమిటో ఇప్పటికే డిసైడ్ అయిపోందని టాక్ వినిపిస్తోంది.

కేటీఆర్ ఎక్కువగా రాష్ట్ర వ్యవహారాలను చూస్తుంటారు. ఢిల్లీ టూర్లు, లేదా ఇతర రాష్ట్రాల టూర్లకు వెళ్లినట్టు కనిపించరు. కాకపోతే విదేశీ పర్యటనలకు మాత్రం ఆయనే వెళ్తుంటారు. స్టేట్ లో అయితే పార్టీలో అయినా, ప్రభుత్వంలో అయినా ఆయనే నెంబర్ 2. తమకు ఏది కావాలన్నా కేటీఆర్ నే అడుగుతారు. కేసీఆర్ కన్నా ముందు కేటీఆర్ దగ్గరే పార్టీ శ్రేణులు తమ సమస్యలను ప్రస్తావిస్తాయి. పరిష్కారాలను వెదుక్కుంటాయి. కీలకమైన నిర్ణయాలన్నీ కేటీఆరే తీసుకుంటారంటాయి పార్టీ వర్గాలు.

అదే కవిత విషయానికి వస్తే.. ఆమె రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. ఎక్కువగా ఢిల్లీ పాలిటిక్స్ లో కనిపిస్తారు. టీఆర్ఎస్ తరపున అక్కడే మంత్రాంగం నడుపుతుంటారు. థర్డ్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ కొన్నాళ్లుగా వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నేతలను కలుస్తుంటారు. ఆ సమయంలో ఆయన పక్కన కేటీఆర్ కనిపించరు. కేవలం కవిత మాత్రమే దర్శనమిస్తారు. అంటే తెలంగాణకు అవతల వ్యవహారాలన్నీ కవిత చూసుకునేలా అంతా సర్దుబాటు చేసినట్టు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

మొత్తానికి ఈ విధంగా ఎవరి బాధ్యత ఏమిటో… ఎవరి పరిధి ఏమిటో కేసీఆర్ డిసైడ్ చేయడం వల్లే ఏ సమస్యా లేదని అంటున్నారు. మరి హరీష్ రావు సంగతేంటి? ఆయనకు పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుంది. కానీ ఆయనకు పార్టీలో కాని, ప్రభుత్వంలో కాని కేటీఆర్ కన్నా ఎక్కువ ప్రాధాన్యత లేకున్నా.. ఆయన గౌరవం ఆయనకుందంటున్నాయి పార్టీ వర్గాలు.

Exit mobile version