Site icon HashtagU Telugu

Fake Doctor : జ‌న‌గామ జిల్లాలో న‌కిలీ డాక్ట‌ర్ అరెస్ట్‌

Fake

Fake

వైద్యుడిలా నటిస్తూ రోగులకు వైద్యం చేస్తున్న ఓ న‌కిలీ డాక్ట‌ర్‌ని జనగాం జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. న‌కిలీ డాక్ట‌ర్ గురించి స‌మాచారం తెలుసుకున్న పోలీసులు, ఆరోగ్యశాఖ అధికారుల బృందం జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలో ఓ క్లినిక్‌పై దాడి చేసి ఆ వ్యక్తిని పట్టుకున్నామని తెలిపారు. న‌కిలీ డాక్ట‌ర్ 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడని.. ఎలాంటి అధీకృత మెడికల్ సర్టిఫికెట్ లేదని తేలిందని పోలీసులు  తెలిపారు. నిందితుడు డాక్టర్‌గా నటిస్తూ క్లినిక్‌ని నడుపుతున్నాడని.. గత మూడు నాలుగేళ్లుగా పైల్స్, ఫిస్టులాకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు ప్రజలకు వైద్యం చేస్తున్నాడ‌ని తెలిపారు. విచారణలో నిందితుడికి వైద్య అర్హత లేదని.. అతను వేర్వేరు వైద్యుల వద్ద సీనియర్ కాంపౌండర్‌గా పనిచేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ఎన్ని సర్జరీలు చేశాడనే దానిపై తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టంలోని నిబంధనలతో పాటు చీటింగ్, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.