Site icon HashtagU Telugu

Asaduddin Owaisi : తాజ్‌మహల్‌ నిర్వహణే చాతకావడం లేదు.. ‘వక్ఫ్’ ఆస్తులూ కావాలా.. ఏఎస్ఐ‌పై అసదుద్దీన్ భగ్గు

Asaduddin Owaisi Taj Mahal Dome Leak

Asaduddin Owaisi : ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తాజ్‌మహల్ ప్రధాన గుమ్మటం (డోమ్) నుంచి నీటి లీకేజీ జరుగుతుండటంపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. తాజ్‌మహల్ నుంచి వందల కోట్ల ఆదాయం లభిస్తున్నా.. దాని కనీస నిర్వహణపై ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ధ్యాస పెట్టడం లేదని ఆయన ఆరోపించారు. భారతీయ కల్చర్‌కు ప్రతీకగా నిలిచే తాజ్‌మహల్ పరిరక్షణలో ఏఎస్ఐ విఫలమైందని అసదుద్దీన్(Asaduddin Owaisi) మండిపడ్డారు.

Also Read :Fuel Truck Explosion: పేలిన ఆయిల్ ట్యాంకర్.. 25 మంది సజీవ దహనం

‘‘తాజ్ మహల్‌ పరిరక్షణలో విఫలమవుతున్న ఏఎస్ఐ వాదన విచిత్రంగా ఉంది. వక్ఫ్ ఆస్తులను కూడా  తానే నిర్వహిస్తానని ఏఎస్ఐ అంటోంది. తాజ్ మహల్ లాంటి అద్భుత కట్టడాలనే నిర్వహించలేకపోతున్న ఏఎస్ఐ‌కు ఇంకా వక్ఫ్ ఆస్తుల వ్యవహారం ఎందుకు ? టెన్త్  ఫెయిలైన వాడు పీహెచ్‌డీకి అప్లై చేసినట్టుగా ఏఎస్ఐ వాదన ఉంది’’ అని పేర్కొంటూ అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.  ప్రపంచ వారసత్వ సంపదగా ఘన కీర్తిని కలిగిన తాజ్ మహల్ దెబ్బతింటుంటే ఏఎస్ఐ చోద్యం చూస్తోందన్నారు. తాజ్ మహల్ డోమ్ లీకేజీకి సంబంధించిన వీడియోపై స్పందిస్తూ ఆయన ఈ పోస్ట్ చేయడం గమనార్హం.

Also Read :President Attacked : కొమొరోస్ దేశాధ్యక్షుడిపై సైనికుడి హత్యాయత్నం.. అసలేం జరిగింది ?

చిన్నపాటి పగుళ్ల వల్ల  తాజ్ మహల్ ప్రధాన డోమ్‌ నుంచి నీటి లీకేజీ జరిగిందని ఏఎస్ఐ అంటోంది. ఆ లీకేజీల వల్ల తాజ్ మహల్ కట్టడం భద్రతకు ఎలాంటి ముప్పూ లేదని చెబుతోంది. ఆయా పగుళ్లను తాము డ్రోన్ సాయంతో ఫొటోలు తీయించి పరిశీలించామని ఏఎస్ఐ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు భారీ వర్షాల  కారణంగా తాజ్ మహల్ ప్రాంగణంలోని ఓ గార్డెన్ నీట మునిగింది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజ్‌మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1632 నుంచి 1653 మధ్యకాలంలో నిర్మించారు. అందులో షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ సమాధి ఉంది. ఇదొక అద్భుత పాలరాతి కట్టడం. యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. విదేశీ టూరిస్టులు తప్పకుండా తాజ్ మహల్‌ను సందర్శిస్తుంటారు.