Site icon HashtagU Telugu

Student Suicide: ఇంటర్ పరీక్షలో ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్య!

Crime

ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షా (Inter Exams) ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందంజలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలో ఫెయిల్ (Failed) అయ్యినందుకు ఓ విద్యార్థి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఈ ఘటనతో విద్యార్థి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిజామాబాద్ – ఆర్మూర్‌కు చెందిన ప్రజ్వల్ అనే విద్యార్థి మాదాపూర్ లోని నారాయణ కాలేజిలో (Narayana College) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివాడు. ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటించిన కొద్దిసేపటికే ఫెయిల్ అయ్యానని తెలుసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రజ్వల్ మరణంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అయితే మార్కులు తక్కువ వచ్చినందుకు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఫెయిల్ అయినందుకు చనిపోయాడా? అనేది తెలియాల్సి ఉంది.

దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 63.32 శాతం మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలకు అర్హత సాధించగా, 67.16 శాతం మంది ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు మొత్తం 4,64,892 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 2,94,378 మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు 54.25 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికల్లో 72.22 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,42,895 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 2,97,458 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 59.21 శాతం ఉత్తీర్ణత సాధించగా, 75.28 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Also Read: Telangana Bonalu: బోనాల పండుగకు వేళాయే..!