Marri Shasidhar Reddy: కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ ఔట్!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్త తెలంగాణలో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
marri shashidhar reddy

marri shashidhar reddy

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్త తెలంగాణలో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ నేతలతో కలసి ఆయన ఢిల్లీకి వెళ్లారని, ఆయన బీజేపీలో చేరుతారనే వార్తలు చక్కర్లుకొట్టాయి. అయితే దీనిపై శశిధర్ రెడ్డి క్లారిటీ కూడా ఇచ్చారు. తాను ఢిల్లీకి రావడం కొత్తేమీ కాదని… తాను ఢిల్లీకి వచ్చిన విమానంలో అన్ని పార్టీల నేతలు ఉన్నారని చెప్పారు. వ్యక్తిగత పనుల మీదే తాను ఢిల్లీకి వచ్చానని అన్నారు.

తాను బీజేపీలో చేరుతున్నాననే వార్తల్లో నిజం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో మర్రిపై కాంగ్రెస్ వేటు వేసింది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నివారణ సంస్థ మాజీ ఉపాధ్యక్షులుగా ఉన్న ఈ సీనియర్ నేతను కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించినట్టు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

  Last Updated: 19 Nov 2022, 05:33 PM IST