Telangana Elections : ఇవి ఎన్నికలు కావు ..డబ్బు నోట్ల కట్టలు

రాజకీయ పార్టీలు సైతం ఎన్నికల్లో ఎవరు ఎక్కువ ఖర్చు చేస్తారో వారికే టికెట్స్ ఇవ్వడం ఆనవాయితగా పెట్టుకున్నారు

  • Written By:
  • Publish Date - November 17, 2023 / 01:12 PM IST

ఒకప్పుడు ఎన్నికలంటే (Elections) ఆ లెక్క వేరేలా ఉండేది..కానీ ఇప్పుడు ఎన్నికలంటే డబ్బు నోట్ల కట్టలుగా మారాయి. ఎవరు ఎక్కువగా డబ్బు (Money) ఖర్చు చేస్తే వారిదే విజయంగా మారింది. ఓటర్లు (Voters) సైతం డబ్బుకే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు తప్ప వారు ఎలాంటి వారు..? వారు అధికారంలోకి వస్తే మేలు జరుగుతుందా..లేదా..? అభివృద్ధి చేస్తారా..లేదా ..? అనేది ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మద్యం , చికెన్ బిర్యానీ , నోట్లకు ఓటర్లు అలవాటుపడ్డారు. రేపు ఎన్నికలు అనే టైం వరకు ఏ పార్టీ నేత అయితే ఎక్కువ డబ్బు ఇస్తారో..ఎక్కవ మద్యం పంచుతారో..వారికే ఓటు వేస్తాం అన్నట్లు మారిపోయారు.

దీంతో రాజకీయ పార్టీలు (Political Parties) సైతం ఎన్నికల్లో ఎవరు ఎక్కువ ఖర్చు చేస్తారో వారికే టికెట్స్ ఇవ్వడం ఆనవాయితగా పెట్టుకున్నారు. ఎన్నికల్లో గెలిచినా అభ్యర్థి..ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేసిన డబ్బును ఏడాది గడిచే లోపు వివాద మార్గాల ద్వారా..అధికారం పేరుతో లాక్కుంటుంటారు. గెలిచినా ఏడాదిలోపే వారు ఖర్చుపెట్టిన డబ్బు సంపాదించి..మిగతా నాలుగేళ్లలో తమ ఆస్తులు పెంచుకోవడం..మళ్లీ ఎన్నికల ప్రచారానికి అయ్యే ఖర్చును సంపాదించడం చేస్తున్నారు. ఇలా ప్రతి రాజకీయ నేత చేస్తున్నాడు.

ఇక ఇప్పడూ తెలంగాణ ఎన్నికల పోరు (Telangana Elections) లో కూడా అదే జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో డబ్బు , మద్యం విచ్చలవిడిగా పారుతున్నాయి. ప్రతి సభకు సదరు రాజకీయ పార్టీల నేతలు ఓటర్లకు డబ్బులు ఇచ్చి తరలించడం..ప్రచారంలో రోజు వారి డబ్బులు ఇవ్వడమే కాదు మధ్యాహ్నం భోజనం , రాత్రి భోజనం , మద్యం , డబ్బు ఇలా అన్ని ఇస్తూ తిప్పుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గం లో బరిలో నిలిచినా అభ్యర్థులు కనీసం రూ.50 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. ఇక గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో అయితే వంద కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే కాదు కుల సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతోనూ బేరసారాలు చేస్తున్నారు. వార్డు మెంబర్ల నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు ప్రతి ఒక్కరికి రేటు కడుతున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో డిజిటల్‌ మొబైల్స్‌ ద్వారా ప్రచారం మొదలు, ఇంటింటికీ కరపత్రం పంపిణీ చేసేందుకు కూలి వరకు డబ్బులు ఇస్తున్నారు. ఒక పార్టీ అభ్యర్థి ప్రచార కూలికి రూ.500 ఇస్తే.. మరో పార్టీ అభ్యర్థి రూ. వెయ్యి ఇస్తున్నారు. ఇంటింటికి పార్టీ గుర్తును, మ్యానిఫెస్టోను ప్రచారం చేసే వ్యక్తికి రోజుకు రూ. 1500 నుంచి 2000 వరకు ఖర్చు చేస్తున్నారు.

ఇక పార్టీల ముఖ్య నేతలు బరిలోకి దిగిన నియోజకవర్గాల్లో అయితే వందల కోట్లు ఖర్చు చేస్తున్నారట..గెలుపే లక్ష్యంగా చేసుకొని ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వెయ్యడం లేదు. అధికార పార్టీ వెయ్యి ఇస్తే..ప్రతిపక్ష నేత రెండు వేలు ఇస్తూ ప్రచారం చేయించుకుంటున్నారు. ప్రజలు సైతం ఉన్న ఈ నాల్గు రోజులు గట్టిగా లాక్కోవాలంటూ ఎవరు డబ్బు ఇచ్చిన వద్దనకుండా తీసుకుంటూ వెళ్తున్నారు. ఇక చివరకు ఎన్నికల్లో గెల్చిన అభ్యర్థి స్వీట్స్ పంచుకుంటే..ఓడిన అభ్యర్థి మాత్రం నెత్తిన తడిగుడ్డ వేసుకోవాల్సిందే. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం ఎన్నికలు అంటే డబ్బు కట్టలుగా మారాయి.

Read Also : Political Parties Free Schemes : ఫ్రీ పథకాలు ఓటర్లకు నష్టమా.. లాభమా..?