Cabinet Expansion : తెలంగాణ రాష్ట్రంలో జులై 2న మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈసారి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు(Cabinet Expansion) దక్కుతాయనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కీలకమైన హోం శాఖ, విద్యా శాఖ, మున్సిపల్, కార్మిక శాఖలు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి. 6 మంత్రి పదవులకుగానూ రెండు రెడ్డి సామాజిక వర్గానికి, రెండు బీసీలకు, ఒకటి లంబాడా వర్గానికి, మరొకటి మైనారిటీ వర్గానికి కేటాయిస్తారని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
రెడ్డి వర్గం నుంచి మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. వీరిలో ఇద్దరికి రాష్ట్ర క్యాబినెట్‌లో చోటు దక్కనుంది. కీలకమైన హోం శాఖను పి.సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. రెడ్డి వర్గానికి చెందిన ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవిని, ఇంకొకరికి ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని కేటాయించనున్నారు. మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్న వారిలో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉన్నారు.
Also Read :Taxes Reduce: వచ్చే నెలలో సామాన్యులకు శుభవార్త వినిపించనున్న మోదీ ప్రభుత్వం..?
ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ పేరును కూడా మంత్రి పదవి కోసం పరిశీలిస్తున్నారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.లంబాడా సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఇక మంత్రి పదవులను ఆశిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువే ఉంది.ఇటీవల మానకొండూరు ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేస్తూ.. జులై రెండో తేదీన ముదిరాజ్ శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పడంతో, ఆ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు బలపడ్డాయి.