Madhu Yaskhi Interview: దేశంలోనే కరప్షన్ సీఎం కేసీఆర్, ‘మునుగోడు’ సీటు కాంగ్రెస్ దే!

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతల్లో మధుయాష్కీ ఒకరు. తన మాటల తూటాలతో ప్రత్యర్థి పార్టీ నాయకులకు చెక్ పెట్టగలిగే నాయకుల్లో ఒకరు.

  • Written By:
  • Updated On - October 4, 2022 / 04:23 PM IST

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతల్లో మధుయాష్కీ ఒకరు. తన మాటల తూటాలతో ప్రత్యర్థి పార్టీ నాయకులకు చెక్ పెట్టగలిగే నాయకుల్లో ఒకరు. పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వర్తించే మధుయాష్కీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మునుగోడు బరిలో కాంగ్రెస్ ఎలాంటి మాస్టర్ స్కెచ్ వేయబోతోంది? బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ ఏవిధంగా ఎదుర్కోబోతోంది? తెలంగాణ లో భారత్ జోడో యాత్రకు ఎలాంటి స్పందన ఉండనుంది? లాంటి విషయాలను హ్యాష్ ట్యాగ్ యూ (Hashtag U) తో షేర్ చేసుకున్నారు. ఆ వివరాలు మీకోసం..

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ఫిక్స్ అయింది కదా. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఎలా ఢీకొట్టబోతోంది?

నల్లగొండ అంటే కాంగ్రెస్ కంచుకోటగా పేరుంది. మునుగోడులో 2014 తప్ప మిగతా అన్ని ఎన్నికల్లో మేమే గెలిచాం. మునుగోడు మా సీటే మేమే గెలుస్తాం. కాంగ్రెస్ కార్యకర్తల అండతో మునుగోడును కైవసం చేసుకుంటాం. అభ్యర్థిని కూడా ఇతర పార్టీల కంటే కాంగ్రెస్ ముందే డిక్లేర్ చేసింది. కాబట్టి మంచి రిజల్ట్ వస్తుందని భావిస్తున్నాం.

సీఎం కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తున్నారు కదా? మరి తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి?

దేశంలో అత్యంత అవినీతి సీఎం ఎవరు అంటే సీఎం కేసీఆర్ మాత్రమే. 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఒక్క విమానం కూడా కొనుగోలు చేయలేదు. బీజేపీ కూడా ఆ సాహసం చేయలేదు. కానీ 8 ఏళ్లలో కేసీఆర్ కు మాత్రమే సొంతం విమానం సాధ్యమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంత అవినీతికి పాల్పడ్డారో స్పష్టంగా తెలుస్తోంది. బంగారు తెలంగాణ అనేది కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులకే.

రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’తో దేశంలో ఎలాంటి మార్పులు వస్తాయనుకుంటున్నారు?

ఇప్పటికే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణలో కూడా తప్పకుండా మంచి ఆదరణ వస్తుందని ఆశిస్తున్నాం. భారత్ జోడో యాత్ర మునుగోడుకు కచ్చితంగా ఫ్లస్ అవుతుంది. లక్షలాది మంది అభిమానులు తెలంగాణలో జరుగబోయే యాత్రలో పాల్గొంటారు. 15 రోజుల్లో 15 లక్షల మంది హాజరవుతారని నా అంచనా.

తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు వర్సెస్ జూనియర్స్ గా మారింది. దీనిపై మీ అభిప్రాయం

కాంగ్రెస్ అంటూ సీనియర్స్, జూనియర్స్ అంటూ ఏమీ లేదు. కొత్తగా కాంగ్రెస్ ల చేరినవాళ్లతో మాత్రమే ఇష్యూ ఉంది. కొత్తగా వచ్చినవాళ్లు మాత్రమే మా పార్టీగా ఫీల్ అవుతున్నారు. అలాంటి వారితో కొంత నష్టం జరుగుతోంది. పార్టీ పెద్దలతో వారందరినీ సెట్ చేసేందుకు ప్రయత్నిస్తాం.

ప్రచార కమిటీగా చైర్మన్ గా మునుగోడులో మీ పాత్ర ఎంటీ?

నేను తెలంగాణలో 119 నియోజకవర్గకు చైర్మన్, కేవలం మునుగోడు మాత్రమే కాదు.. మునుగోడు మా టీం బాగా పనిచేస్తోంది. చిన్న చిన్న సమస్యలు మాత్రం ఉన్నాయి. వాటిని పరిష్కించేందుకు పాటు పడుతాం.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు ప్రచారంలో పాల్గొంటారా?

నేను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్సనల్ పీఏ ను కాదు.. ఆ విషయం నాకు తెలియదు. అయన్ను మీరే అడగండి