Tenth – Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈ నెల 24న ఉదయం 11 గంటలకు రిలీజ్ కానున్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. రెండు సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలను రాశారు. ఏప్రిల్ 10వ తేదీనే జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయింది. మార్కుల నమోదుతోపాటు ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత అధికారులు ఫలితాలను వెల్లడించనున్నారు. ఇంటర్ ఫస్ట్, సెంకడ్ ఇయర్ రిజల్ట్స్ కోసం అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.inలోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
We’re now on WhatsApp. Click to Join
పదోతరగతి ఫలితాల(Tenth – Inter Results) కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 30న లేదా వచ్చేనెల 1న ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పదో తరగతి పరీక్షలు మార్చి నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. 5,08,385 మంది పరీక్షలు రాశారు. దీనికి సంబంధించిన మూల్యాంకనం శనివారమే పూర్తయింది. వారం రోజులపాటు ఫలితాల డీకోడింగ్ అనంతరం ఈనెల 30న లేదా వచ్చే నెల 1న ఉదయం ఫలితాలను వెల్లడించాలని తెలంగాణ విద్యాశాఖ భావిస్తోంది. ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు ఇప్పటికే ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా మంత్రులు కాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.
