Kavitha Bail: కవితకు షాక్.. బెయిల్ నిరాకరణ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత చేసిన పిటిషన్‌లను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తిరస్కరించారు

Kavitha Bail: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత చేసిన పిటిషన్‌లను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తిరస్కరించారు. కవిత ప్రస్తుతం సీబీఐ, ఈడీ కేసుల్లో తీహార్ జైలులో ఉన్నారు. ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తనను విచారించేందుకు సీబీఐకి అనుమతిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కవిత ప్రత్యేక పిటిషన్‌లో సవాలు చేశారు.

మనీలాండరింగ్‌తో పాటు సీబీఐ నమోదు చేసిన అవినీతి కేసులో ట్రయల్ కోర్టు కవితకు బెయిల్ నిరాకరించింది. అయితే తన బెయిల్ దరఖాస్తులను ట్రయల్ కోర్టు కొట్టివేయడాన్ని కవిత సవాల్ చేశారు. సిబిఐ మరియు ఇడి కవిత బెయిల్ పిటిషన్‌లను వ్యతిరేకించాయి. ఆమె సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిబిఐ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.

Also Read; Photo Talk : బాబు – జగన్ మధ్య అదే తేడా