Ex MP Ravindra Naik : కాంగ్రెస్ లోకి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్

రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు

Published By: HashtagU Telugu Desk
Ravindranaik

Ravindranaik

లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ లోకి వలసల పర్వం రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఇప్పటికే బిఆర్ఎస్ , బిజెపి నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా..ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ (Ex MP Ravindra Naik) కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).

We’re now on WhatsApp. Click to Join.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు ఎమ్మెల్యేగా, 2004లో వరంగల్ ఎంపీగా రవీంద్ర నాయక్ పనిచేయడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. అనంతరం 2019లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. గత నెలలో బీజేపీకి రాజీనామా చేసిన ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. బంజారా కమిషన్ ఏర్పాటు పట్ల బీజేపీ నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని, బీజేపీలో ఉన్న సీనియర్ లంబాడి నాయకుడిని తానేనని అయినా ఏ విషయంలోనూ బీజేపీ నేతలు తనను సంప్రదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

అలాగే ఈరోజు బిఆర్ఎస్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (BRS MLA Prakash Goud) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన పార్టీ లో చేరేందుకు సిద్దమైనట్లు రేవంత్ తో చెప్పినట్లు తెలుస్తుంది. మరో రెండు , మూడు రోజుల్లో ఆయన అధికారికంగా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని అర్ధం అవుతుంది.

Read Also : Kurchi Madathapetti : ‘కుర్చీ మడతబెట్టి’ సాంగ్‌లో ఇంతుందా మీనింగ్.. చంద్రబాబుతో పోలుస్తూ ఏమన్నా చెప్పిందా..

  Last Updated: 19 Apr 2024, 12:41 PM IST