ఎన్నికల సమయం మరింత దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ లో వలసల పర్వం మరింత ఎక్కువుతుంది. ఇతర పార్టీల నేతలు , లీడర్స్ పెద్ద ఎత్తున బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా ఈరోజు కేసీఆర్ (KCR) సమక్షంలో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు (Ex MLA Thati Venkateswarlu) బిఆర్ఎస్ (BRS) లో చేరారు.
ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా ఈరోజు కేసీఆర్ దమ్మపేట (Dammapeta)లో భారీ సభ ఏర్పాటు చేసారు. ఈ సభ కు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజలు , కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్బంగా కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తో పాటు సున్నం నాగమణి తదితర కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ లో చేరారు. వీరిందరికి కేసీఆర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ (KCR) మాట్లాడుతూ…నేను మిమ్మల్ని ఒకటే కోరుతన్నా. ఎన్నికలు వచ్చాయంటే ఆగం కావొద్దు. నినాదంగా మంచీ చెడు ఆలోచించాలి. ఎన్నికలు వచ్చాయంటే పార్టీకి కొరు నిలబడుతరు. బీఆర్‌ఎస్ నుంచి నాగేశ్వర్‌రావు నిలబడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి వేరేవాళ్లు నిలబడతారు. అన్నింటి కన్నా ముఖ్యంగా అభ్యర్థుల వెనుక పార్టీలు ఉన్నయ్. ఆ పార్టీల చరిత్ర, నడవడిక, ఆ పార్టీలకు అధికారం ఇస్తే ఏం ఆలోచిస్తారు.. బీదసాదల గురించి ఆ పార్టీల దృక్పథం ఏంటీ? ఆలోచన సరళి ఏంటీ అనే విషయం గ్రామాల్లో, పట్టణాల్లో చర్చ జరగాలి’ అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎమ్మెల్యే ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ..ఎనిమిది వందల కోట్లతో అశ్వరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని , రూ.35 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ, డిగ్రీ కాలేజీ, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశామని అన్నారు. అన్ని గ్రామాల్లో మంచినీటి సమస్యను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గతంలో ఎవరు చేయని విధంగా ఇప్పటికే పదివేల మందికి పోడు పట్టాలు అందజేశారు. కొన్ని చోట్ల సాదాబైనమాలు పెండింగ్‌లో ఉన్నాయని అవి కూడా చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వినాయకపురంలో రెవెన్యూ ఆఫీస్ ఏర్పాటు చేయాలని కోరారు.
తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ విజయానికి తన వంతు బాధ్యతగా పని చేస్తానని స్పష్టం చేశారు.
Read Also : Samantha : బాత్ టబ్‌లో ఫొటో షేర్ చేసిన సమంత.. భూటాన్‌లో ఫుల్ ఎంజాయ్..