Site icon HashtagU Telugu

Viral : కవిత కాళ్లు మొక్కిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి…

Ex Mla Jeevan Reddy Touch K

Ex Mla Jeevan Reddy Touch K

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఫై విడుదలైన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాళ్లను మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మొక్కడం ఫై అంత చర్చగా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Scam Case)లో బెయిల్ ఫై విడుదలైన కవిత..తన తండ్రి కేసీఆర్ ను కలిశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Case)లో ఈడీ అధికారులు కవిత(BRS MLC Kavitha)ను మార్చి 15న అరెస్ట్​ చేయగా, అప్పటి నుంచి దాదాపు 5 నెలలకు పైగా ఆమె తిహాడ్‌ జైలులోనే ఉన్నారు. బెయిల్ ఫై విడుదలై హైదరాబాద్ కు చేరుకున్న కవిత కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి బంజారాహిల్స్ లోని తన ఇంటి వరకు భారీగా కార్ ర్యాలీ తో స్వాగతం పలికారు. చాలారోజుల తర్వాత ఆమెను చూసిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు, జాగృతి నాయకులు, మహిళలు భావోద్వేగానికి గురయ్యారు. ఇంట్లోకి రాగానే కవిత ముందుగా పూజగదిలో దేవుడికి సాష్ఠాంగ నమస్కారం చేసి తల్లి శోభమ్మకు పాదాభివందనం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈరోజు కవిత ఎర్రవెల్లి ఫామస్ కు వెళ్లిన ఆమె తండ్రిని కలిసి ఆయన పాదాలకు నమస్కరించారు. అనంతరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. కవితకు కేసీఆర్ షేక్ హ్యాండ్ ఇవ్వగా ఆమె ఆయన చేతికి ప్రేమతో ముద్దు పెట్టారు. జైలు నుండి బయటకొచ్చిన బిడ్డను చూడ‌గానే కేసీఆర్ ముఖంలో ఆనందం క‌నిపించింది. చాలాకాలం తర్వాత ఉత్సాహంతో కేసీఆర్ కనిపించారు. తమ అధినేత సంతోషంలో పార్టీ నాయ‌కులు, సిబ్బంది భాగ‌స్వామ్యం అయ్యారు. కవిత రాకతో ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో సంతోషం వెల్లివిరిసింది. ప్రస్తుతం కవిత 10 రోజులపాటు కేసీఆర్ తో పాటు ఫామ్ హౌస్ లోనే ఉండనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటె తన తండ్రిని కలిసే సందర్భంలో కవిత కారు దిగి లోపలికి వచ్చే క్రమంలో అక్కడే ఉన్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కవిత కాళ్లకు నమష్కారం చేశాడు. ఇలా ఆయన నమష్కారం చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడమే కాకుండా చర్చనీయాశంగా మారింది. ఇది ఇలా ఉంటే.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వయసులో కవిత కంటే పెద్దవారు. అలాంటి వ్యక్తి ఆమె కాళ్లకు నమస్కారం చేయడం ఏంటని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అలా వయస్సులో తన కంటే పెద్ద వాడైన జీవన్ రెడ్డి.. కాళ్లు మొక్కేటప్పుడు కవిత కూడా తిరస్కరించకపోవడం గమనార్హం.

Read Also : Alleti Maheshwar Reddy : ‘హైడ్రా’ రంగనాధ్ కమిషనరా? లేక పొలిటికల్ లీడరా? – MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి