Site icon HashtagU Telugu

Sridhar Babu : రేవంత్‌రెడ్డికి షాక్ ఇవ్వ‌బోతున్న శ్రీథ‌ర్‌బాబు?

Sridhar Babu Revanth Reddy

Sridhar Babu Revanth Reddy

టీపీసీసీ చీఫ్ రేవంత్‌కు మ‌రో భారీ షాక్ త‌గ‌ల‌బోతోందా? అవున‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టీఆర్ఎస్ టచ్ లోకి వెళ్ళారనే వార్త ఈ మ‌ధ్య‌కాలంలో తెగ వైర‌ల్ అవుతోంది. వాస్త‌వానికి ఈ మ‌ధ్య‌కాలంలో కాంగ్రెస్ పార్టీలో జ‌రుగుతున్న ప్రోగ్రామ్స్‌కు శ్రీధ‌ర్‌బాబు దూరంగానే ఉంటుంన్నారు. తాజాగా జ‌రిగిన కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి సహకరించేలా ఆయన కాంగ్రెస్ పార్టీ ఓటర్లతో క్యాంపు నిర్వహించారనే ప్రచారం జరిగింది. తాజాగా ఆయన వ్యవహారం కాంగ్రెస్ నుంచి ఆయన బయటికి వస్తున్నారనే ప్రచారానికి బలం చేకూర్చుతోంది.

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ మాజీ చీఫ్, బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహాం హైదరాబాద్ మాదాపూర్ లో జరిగింది. ఈ పెళ్లికి తెలంగాణ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ సీనియర్ నేతలు మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్, శ్రీధర్ బాబు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇద్దరూ పక్క పక్కనే కూర్చొని ఫోటోలు సైతం తీసుకున్నారు. చాలా సేపు ఇద్దరూ కలిసే ఉన్నారు. దీంతో శ్రీధర్ బాబు కారెక్కడం ఖాయమనే చర్చ మొదలైంది.

గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు,పాడి కౌశిక్ రెడ్డి, పెళ్లి విందులోనే కేటీఆర్ ‘టచ్’ లోకి వెళ్ళారని, చివరకు గులాబీ కండువా కప్పుకున్నారని గుర్తు చేస్తున్నారు. అలాగే, శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీలో అంత కంఫర్టబుల్ లేరని చాలా కాలంగా వార్త లొస్తున్నాయి. పీసీసీ పదవిని ఆశించి భంగ పడిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జగ్గారెడ్డి బయట పడినంతగా, శ్రీధర్ బాబు బయట పడక పోయినా, పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. సో .. ఏమి జరిగినా జరగ వచ్చనే మాట కూడా వినవస్తోంది. ప్రస్తుతానికి అయితే, ఇద్దరి మధ్య మాట కలిసింది,మనువు కుదిరిందా లేదా అనేది,ముందుముందు గానే తెలవదు. గతంలో కోమటి రెడ్డి సోదరులు, భట్టి విక్రమార్క, జగ్గా రెడ్డి విషయంలో కూడా ఇలాగే, పుకార్లు షికార్లు చేశాయి.

Exit mobile version