Site icon HashtagU Telugu

Jupally Krishna Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జూపల్లి, కేసీఆర్ పై ఘాటు విమర్శలు

Jupally

Jupally

మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  సమక్షంలో పార్టీలో చేరిన మాజీ మంత్రి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జూపల్లి కృష్ణారావుతో పాటు  మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి లను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన అంతానికి.. ప్రజారంజక కాంగ్రెస్ పాలన రాబోతోందనడానికి ఈ చేరికలు సంకేతంగా భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం జూపల్లి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని తానేక్కడా చూడలేదని మండిపడ్డారు. ఒక ఫాసిస్ట్‌గా కేసీఆర్ రాష్ట్రాన్ని ఏలుతున్నాడని ఫైరయ్యాడు. కేసీఆర్ సర్కార్‌లో ఏ వర్గానికి కూడా న్యాయం జరుగలేదన్నారు. ప్రజల్ని మభ్యపెట్టి నియంతలా పాలిస్తున్నాడని.. అన్ని వర్గాలను ఎన్నికలకు వాడుకుంటున్నాడని తెలిపారు.

దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయాడని మండిపడ్డారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రైతులను మభ్య పెట్టేందుకు రుణమాఫీ, ఆర్టీసీ కార్మికులను లొంగదీసుకునేందుకు ప్రభుత్వంలో విలీనం అంటూ కొత్త నాటకాలకు తెరలేపాడని ఆక్షేపించారు. ఇక తెలంగాణలో ఎన్నికలు సమీపస్తుండటంతో కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీకి బలం చేకూరినట్టయింది. ఇప్పటికే పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఖమ్మం జిల్లాలో యాక్టివ్ పాలిటిక్స్ కు దిగారు. ఈ నేపథ్యంలో మున్ముందు భారీ చేరికలు ఉంటాయని ఇప్పటికే టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరారు. కర్ణాటక లో మాదిరిగా తెలంగాణలోనూ అధికారం దక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Bandi Sanjay: మోడీతో బండి భేటీ, ఆ తర్వాత బాధ్యతల స్వీకరణ