Site icon HashtagU Telugu

Jupalli Krishnarao: మాజీ మంత్రి జూపల్లి అరెస్ట్.. నాగర్ కర్నూల్ లో ఉద్రిక్తత

Excise Minister

Excise Minister

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ పై వ్యతిరేక గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారంనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు రైతులతో కలిసి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన నిర్వహించారు. వరి కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టాలని డిమాండ్ తో నాగర్ కర్నూల్ కలెక్టర్ రేట్ ముందు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.

ఈ విషయమై కలెక్టర్ స్పందించాలని జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. అధికారుల నుండి స్పంద న రాకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో పోలీసులు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహ ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అరెస్ట్ ను నిరసిస్తూ ఆయన అనుచరులు బైక్ కు నిప్పు పెట్టారు. దీంతో నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా జూపల్లితో పాటు పొంగులేటి బీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇతర పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

Also Read: Dhanush New look: కొత్త లుక్ లో ధనుష్.. రామ్ దేవ్ బాబా అంటూ నెటిజన్స్ ట్రోల్స్!

Exit mobile version