Telangana Assembly : అసెంబ్లీ టీవీలో మాముఖాలు చూపించరా..? ఇంత అన్యాయమా..? – హరీష్ రావు

  • Written By:
  • Publish Date - February 17, 2024 / 04:02 PM IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly Session) భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లో సభలో ‘శ్వేతపత్రం’ (White Paper) రిలీజ్ చేసింది. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో అన్నీ అసత్యాలే తెలిపారని హరీష్ పేర్కొన్నారు. ఇదే సందర్బంగా..తనను అసెంబ్లీ టీవీలో చూపించరా? అని ప్రశ్నించారు. తన ఇంటి నుంచి ఫోన్ చేసి మరీ అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. నన్ను తప్ప అందర్నీ చూపిస్తున్నారని… మా ముఖాలు కూడా చూపించకుండా ఇంత అన్యాయమా? అని మండిపడ్డారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పందించారు. అలాంటిదేమీ లేదని… అందర్నీ చూపిస్తామని స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రం ఫై హరీష్ రావు మండిపడ్డారు. ఇది శ్వేత పత్రం కాదని.. అబద్దపు పత్రమని కామెంట్ చేశారు. ఈ శ్వేతపత్రం ఫై సుదీర్ఘంగా ఎన్ని గంటలైనా చర్చిద్దామని, ఎంత సమయమైనా కేటాయిస్తామని సభా నాయకుడు చెప్పారని .. కానీ ఇంత మంచి విషయం 30 నిమిషాల్లో చెప్పడం సాధ్యం కాదని, కనీసం తనకు 2 గంటలైనా సమయం కేటాయించాలని హరీష్ రావు చెప్పుకొచ్చారు.

గత ప్రభుత్వంపై బురద జల్లే ఉద్దేశంతోనే శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టారు. శ్వేతపత్రాన్ని ఇప్పుడే ఇచ్చారు. ఇంత తక్కువ సమయంలో 4 సత్యదూరమైన అంశాలు గుర్తించా. మధ్యమానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయన్నది అసత్యం. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసిందే మేము’ అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. రూ.775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిడ్‌మానేరు, ఎల్లంపల్లి తమ హయాంలో పూర్తైందన్నారు. ఈ ప్రాజెక్టులు కాంగ్రెస్‌ హయాంలో పూర్తి అయ్యాయని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇకపై పోటీ చేసి సభలో అడుగు పెట్టబోనని సవాల్ చేశారు.

Read Also : ISRO Success : ఇస్రోకు మరో సక్సెస్.. హిందూ మహాసముద్రంలో ఉపగ్రహం కూల్చివేత