KCR : ఎమ్మెల్యే గా ప్రమాణం చేసిన కేసీఆర్‌..

బీఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR) అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ (Speaker Chamber) లో గజ్వేల్ ఎమ్మెల్యేగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనచే ప్రమాణస్వీకారం చేయించారు. గత ఏడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి శాసన సభ్యుడిగా కేసీఆర్‌ విజయం సాధించారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రమాదవశాత్తు జారిపడడంతో తుంటి ఎముకకు గాయం అయ్యింది. దీంతో ఆపరేషన్‌ చేసారు. We’re now […]

Published By: HashtagU Telugu Desk
KCR

Kcr

బీఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR) అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ (Speaker Chamber) లో గజ్వేల్ ఎమ్మెల్యేగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనచే ప్రమాణస్వీకారం చేయించారు. గత ఏడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి శాసన సభ్యుడిగా కేసీఆర్‌ విజయం సాధించారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రమాదవశాత్తు జారిపడడంతో తుంటి ఎముకకు గాయం అయ్యింది. దీంతో ఆపరేషన్‌ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.

దాదాపు రెండు నెలలుగా విశ్రాంతి తీసుకుంటూ వస్తున్న కేసీఆర్..ఈ మధ్యనే కర్ర సాయం తో నడుస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేసారు. ప్రమాణం అనంతరం అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో పూజలు చేశారు. బీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్‌ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న విషయం తెలిసిందే. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్‌ కార్యక్రమాలను యాక్టివేట్ చేసేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు.

Read Also : Interim Budget : బడ్జెట్‌లో పలు శాఖలకు.. పథకాలకు కేటాయింపులు చూస్తే..

  Last Updated: 01 Feb 2024, 02:29 PM IST