Site icon HashtagU Telugu

Telangana: స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం .. గోల్కొండపై జెండా ఎగురవేయనున్న సీఎం రేవంత్

Aug 15 Reavanth

Aug 15 Reavanth

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం జరిగిన నుంచి 2023 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు..గోల్కొండ కోటపై జెండా ఎగురవేసే సంప్రదాయం మాజీ సీఎం కేసీఆర్ (Ex Cm KCr) దే. కానీ ఇప్పుడు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress), తొలిసారి జెండా పండుగను (Independance Day).. ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) గోల్కొండ (Golconda Fort) కోటపై తొలిసారి త్రివర్ణ పతాకం (Flag Hosting)ఎగురవేయనున్నారు. అనంతరం, అక్కడి నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 8 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి ఫలాలపై ఆయన వివరిస్తారు. గతంలోని బీఆర్ఎస్ (Brs Failure) సర్కార్ వైఫల్యాలను కూడా ఆయన ఎండగడతారు.

సీఎం (Cm Revanth Reddy) సహా రాజకీయ ప్రముఖులు (Main Politicians) గోల్కొండ కోటకు తరలిరానుండటంతో, ముఖ్యమంత్రి కార్యదర్శి శాంతకుమారి (Cs Shantha Kumar) అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఆమె అమెరికా (Us Tour) పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత, గోల్కొండలో ఏర్పాట్లను (Review) సమీక్షించారు. వర్షం కురిస్తే, వేడుకలకు హాజరయ్యేవారు తడవకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ టెంట్లు (Water Proof Tents) ఏర్పాటు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. వీఐపీల రాకతో ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు, పార్కింగ్ పై దృష్టి సారించాలని పోలీసులను (Ts Police) ఆమె సూచించారు.