Site icon HashtagU Telugu

Etela Rajendar : ఏపీలో 20 లక్షల ఇళ్లు.. మరి తెలంగాణ సంగతేంటి ? – ఈటెల రాజేందర్

Etela Rajendra fires on KCR Government Regarding Houses

Etela Rajendra fires on KCR Government Regarding Houses

ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) దేశంలో పేదలకోసం 3.50 కోట్ల ఇళ్లను కట్టించగా.. ఏపీలో 20 లక్షల ఇళ్లు కట్టించినట్లు సర్వేలు చెబుతున్నాయి. కానీ తెలంగాణలో(Telangana) పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చకుండా వాళ్ల కళ్లలో కేసీఆర్(KCR) ప్రభుత్వం మట్టికొట్టిందని బీజేపీ(BJP) నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్(Etela Rajendar) విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం సురంగర్ గ్రామంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు, వృద్ధులు, వికలాంగులకు ఆరోగ్య పనిముట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద ప్రజలు కోరుకునేవి రెండే రెండని.. ఒకటి సొంత ఇల్లు, రెండవది చనిపోయాక పాతిపెట్టేందుకు కాస్తంత స్థలం ఉండాలనుకుంటారని అన్నారు. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్.. రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ వస్తే దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు ఎన్నో ఏళ్లుగా దున్నుకుంటున్న భూమిని ప్రభుత్వం లాక్కుంటోందని దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లాను గ్రీన్ హౌస్ కల్టివేటింగ్ చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. అక్కడ పాలిహౌస్ నిర్మించుకునేందుకు సబ్సిడీ ఇస్తామని చెప్పి మొండిచేయి చూపించారని, పాలి హౌస్ నిర్మించుకున్న రైతులు సబ్సిడీ లేక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు.

రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ప్రజలకు, రైతులకు పాలిహౌస్ నిర్మాణానికి, పందిరి వ్యవసాయానికి, కల్టివేటింగ్ కు పనిముట్లు, ట్రాక్టర్లు అందజేస్తామన్నారు. పెన్షన్, రైతులకు భీమా, రైతు బంధు లాంటి పథకాలకు కేసీఆర్ ఖర్చు చేసేది రూ.25 వేల కోట్లు అయితే.. బెల్టు షాపుల ద్వారా వచ్చే ఆదాయం రూ.45 వేల కోట్లు అని ఈటెల పేర్కొన్నారు. తెలంగాణలో అర్థరాత్రి కడుపునొప్పొస్తే ట్యాబ్లెట్ దొరక్కపోవచ్చేమో గానీ.. మందు బాటిల్స్ దండిగాcదొరుకుతాయని ఎద్దేవా చేశారు.

Rajendar

Also Read : KTR : కాంగ్రెస్ డబ్బులు ఇస్తే తీసుకోండి.. కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్‌కే వేయండి..